Begin typing your search above and press return to search.

జీవీ విసిరిన స‌వాల్‌తో వైసీపీ ' బొల్లా ' నోటికి తాళం ప‌డిందే...!

ఇంత‌కీ జీవీ విసిరిన స‌వాల్ ఏంటంటే.. ''నాలుగేళ్ల‌లో నువ్వు ఏం చేశావో.. ప్ర‌జ‌ల‌కు చెప్పే ధైర్యం ఉందా బొల్లా?'' అని ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:41 AM GMT
జీవీ విసిరిన స‌వాల్‌తో వైసీపీ  బొల్లా  నోటికి తాళం ప‌డిందే...!
X

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో.. తానే సూప‌ర్ అని.. త‌న‌ను మించిన నాయ‌కు డు లేడ‌ని.. త‌న‌ను తాను నిఖార్స‌యిన‌.. నిజాయితీతో కూడిన నాయ‌కుడిగా.. ఆప‌ద్భాంధ‌వుడిగా చెప్పుకొనే వైసీపీ నాయ‌కులు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు గ‌త రెండు రోజులుగా ఊసేలేకుండా పోయిం ది. ఇటీవ‌ల కాలంలో చావు-పెళ్లి-పేరంటం అనే తేడా లేకుండా.. ఎక్క‌డ ఏం జ‌రిగినా ఆయ‌న వాలిపోతు న్నారు. సొంత సోష‌ల్ మీడియా వేదిక‌లు పెట్టుకుని.. త‌న‌ను తానే ప్ర‌చారం చేసుకుంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపు ఖాయ‌మ‌ని కూడా బొల్లా త‌న‌కు తానే చెప్పుకొంటారు. అంతేకాదు.. గెలిచేశాన‌ని కూడా అనుకుంటారు. అయితే.. అలాంటి నాయ‌కుడు.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు విసిరిన స‌వాల్‌కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

క‌నీసం ఆ మాట కూడా ఎత్త‌డం లేదు. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేస్తాన‌ని చెబుతున్న బోల్లా.. జీవీ విసిరిన స‌వాల్‌ను ఎందుకు స్వీక‌రిం చ‌లేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇంత‌కీ జీవీ విసిరిన స‌వాల్ ఏంటంటే.. ''నాలుగేళ్ల‌లో నువ్వు ఏం చేశావో.. ప్ర‌జ‌ల‌కు చెప్పే ధైర్యం ఉందా బొల్లా?'' అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ''ఇప్పుడునువ్వు న‌డుస్తున్న రోడ్లు, నువ్వు తిరుగుతున్న ర‌హ‌దారులు.. గ్రామ స్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు వినుకొండ ప‌ట్ట‌ణం వ‌ర‌కు కూడా నేను వేయించిన‌వే.

అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రికి నివేదిక‌లు పంపించి.. నిధులు తెప్పించి.. రోడ్లు వేయించా. ప్ర‌జ‌లకు తాగునీరు అందించా. మ‌రి నువ్వు ఏం చేశావో చెప్పు'' అని జీవీ నిల‌దీశారు.

కానీ, ఇది జ‌రిగి రెండు రోజులు అయినా.. బొల్లా మాత్రం ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. క‌నీసం .. మాట మాత్రం గా అయినా.. ఆయ‌న నోరు విప్ప‌లేదు. దీంతో సొంత పార్టీ నాయ‌కులే.. పెద‌వి విరుస్తున్నారు. ''ఏముంది చెప్పుకోవడానికి,టీడీపీ నాయ‌కులు అన్న మాట‌ల్లో త‌ప్పులేదు. ఈయ‌న ఏమైనా చేసి ఉంటే.. చెప్పుకొనే వారు. కానీ, చేయ‌లేదు. జీవీ చెప్పిన మాటల్లో త‌ప్పేముంది. గ‌తంలో వేసిన రోడ్ల‌పైనే ఇప్పుడు తిరుగుతున్నాం.'' అని వైసీపీ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.