Begin typing your search above and press return to search.

'మొత్తం సెట్ చేశా.. ఇక దిగిపోతా'.. బోయింగ్‌ టాప్‌ ఆఫీసర్‌ కీలక వ్యాఖ్యలు!

అవును... అమెరికాకు చెందిన విమాన నిర్మాణసంస్థ బోయింగ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ బ్రియాన్‌ వెస్ట్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   1 July 2025 6:00 PM IST
మొత్తం సెట్  చేశా.. ఇక దిగిపోతా.. బోయింగ్‌  టాప్‌  ఆఫీసర్‌  కీలక వ్యాఖ్యలు!
X

సంక్షోభంలో చిక్కుకున్న విమాన తయారీ సంస్థను నిలబెట్టడానికి గత సంవత్సరం అమెరికా కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద నిధుల సేకరణలలో ఒకదానిని నిర్వహించడంలో కీలక భూమిక పోషించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ వెస్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోయింగ్ కంపెనీ తెలిపింది. ఆగస్టు మధ్యలో వెస్ట్ ఈ పదవి నుంచి వైదొలుగుతున్నారని వెల్లడించింది.

అవును... అమెరికాకు చెందిన విమాన నిర్మాణసంస్థ బోయింగ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ బ్రియాన్‌ వెస్ట్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సంస్థ ప్రకటించింది. గతేడాది బోయింగ్‌ సంస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో నిధుల సేకరణలో అయన కీలక పాత్ర పోషించారని తెలిపింది! ఆయన స్థానంలో లాక్‌ హీడ్ మార్టిన్ కార్ప్ మాజీ ఎగ్జిక్యూటివ్ జీసస్ జే మాలావే బాధ్యతలు స్వీకరించనున్నారు.

బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెల్లీ ఓర్ట్‌ బర్గ్‌ బ్రియాన్‌ వెస్ట్ సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. ఈ రెండు చర్యలు ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన వెస్ట్... బోయింగ్‌ లో ప్రస్తుతం బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా, నిర్వహణ సామర్థ్యం మెరుగ్గా ఉండడంతో తాను పదవి నుంచి దిగిపోవడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

గత సంవత్సరం తీవ్ర సమ్మె తర్వాత ఉత్పత్తిలో తీవ్ర మందగమనం కారణంగా రేటింగ్‌ లు దారుణమైన స్థితికి దిగజారకుండా ఉండటానికి.. నిధుల సమీకరణ చేపట్టడంలో వెస్ట్ కీలక భూమిక పోషించారు. $24 బిలియన్ల ఈక్విటీ అమ్మకంతో బోయింగ్ నగదు నిల్వలను పెంచడంలో ఆయన పాత్ర కీలకం. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆ సంస్థ స్టాక్ 18% లాభపడింది.