Begin typing your search above and press return to search.

రీల్ విలన్ బాబీ సింహపై రియల్ గా కేసు కట్టేశారు

వాల్తేరు వీరయ్య మూవీని గుర్తుకు తెచ్చుకుంటే.. అందులోని విలన్ పొగరు.. అతగాడి విలనిజం ఎంతలా పండిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:58 AM GMT
రీల్ విలన్ బాబీ సింహపై రియల్ గా కేసు కట్టేశారు
X

వాల్తేరు వీరయ్య మూవీని గుర్తుకు తెచ్చుకుంటే.. అందులోని విలన్ పొగరు.. అతగాడి విలనిజం ఎంతలా పండిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వెండి తెర మీద సోలమన్ సీజర్ పాత్రలో జీవించిన విజయ సింహ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్టు అయ్యారు. తమిళం.. మలయాళంలో ఇప్పటికే బోలెడన్నిచిత్రాల్లో నటించిన అతడు..రీల్ కు భిన్నమైన రియల్ క్రైంకు సంబంధించిన ఒక కేసు అతడిపైన నమోదైంది. కొడైకెనాల్ లో పుట్టి పెరిగిన బాబీ సింహ.. తాజాగా అక్కడో ఇంటిని కట్టుకుంటున్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువ స్థలంలో ఇంటిని నిర్మిస్తున్న ఆయనపై ఫిర్యాదు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇంటి నిర్మాణాన్ని కాంట్రాక్టర్ జమీర్ కు ఇవ్వటం.. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య గొడవలు రావటంతో పనులు ఆగిపోయాయి. జమీర్ కు డబ్బులు ఇచ్చే విషయంలో అతడికి, విజయ సింహకు మధ్య వివాదం ఉంది. ఈ ఇష్యూలో జమీర్ బంధువు కమ్ ఇంజినీర్ అయిన హుస్సేన్ తలదూర్చారు. డబ్బుల విషయాన్ని తేల్చాలని విజయసింహను కోరినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. జమీర్ గెస్టు హౌస్ కు గత నెల 20న బాబీ సింహ, కేజీఎఫ్ లో నటించిన రామచంద్రన్ రాజ్.. మరో ఇద్దరు వచ్చి ఇంటి నిర్మాణ విషయంలో తలదూర్చొద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు బాబీ సింహ.. రామచంద్రన్ రాజ్ తో సహా నలుగురిపై కేసులు కట్టారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.