నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా విషయంలో ‘బ్లడ్ మనీ’ పాత్ర ఏంటి..?
కేరళకు చెందిన నిమిషా ప్రియాకు యెమెన్ లో ఉరిశిక్ష పడింది. ఆ దేశస్తుడిని హత్య చేసిన కారణంగా అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
By: Tupaki Desk | 15 July 2025 5:54 PM ISTకేరళకు చెందిన నిమిషా ప్రియాకు యెమెన్ లో ఉరిశిక్ష పడింది. ఆ దేశస్తుడిని హత్య చేసిన కారణంగా అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును జూలై 16, 2025న అమలు చేసేందుకు అన్ని సన్నాహాలు చేశారు. కానీ చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా వేసినట్లు అక్కడి ప్రభుత్వం భారత్ కు సమాచారం ఇచ్చింది. ఇందులో ‘బ్లడ్ మనీ’ కీలక పాత్ర ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా పడడం చాలా అరుదుగా సంభవిస్తుంది. అసలు ఏంటి ఈ ‘బ్లడ్ మనీ’ ఇది ఎలా చెల్లిస్తారు. ఇది చెల్లిస్తే శిక్షల నుంచి బయటపడవచ్చా చూద్దాం..
బ్లడ్ మనీ అంటే..
క్షమాపణకు బదులుగా బాధిత వ్యక్తి కుటుంబానికి చెల్లించే పరిహారమే ‘బ్లడ్ మనీ’. ఖురాన్ లో దీని గురించి ప్రస్తావన ఉంది. ‘ఇస్లాంను నమ్మే వ్యక్తిని హత్య చేస్తే మరణించని కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వాలి. ఒక వేళ బ్లడ్ మనీని భరించలేకపోయిన వారు వరుసగా రెండు నెలలు ఉపవాసం ఉండాలి’ అని ఉంది. షిరియా చట్టంలో దీన్ని తీసుకువచ్చాయి కొన్ని దేశాలు. ముఖ్యంగా యెమెన్, సౌదీ అరేరబియా, ఇరాన్, పాకిస్తాన్ తో సహా కొన్ని ఇస్లామిక్ దేశాలు బ్లడ్ మనీని చట్టంగా చేశాయి. అంటే ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరం వలన బాధపడిన వారు, వారి కుటుంబ సభ్యులు కొంత మేర డబ్బును డిమాండ్ చేయవచ్చు. దీన్నే ‘బ్లడ్ మనీ’ అంటారు. షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీకి తలాల్ అబ్దో మెహదీ కుటుంబం అంగీకరిస్తే ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష కూడా దొరుకుతుంది. బ్లడ్ బనీ అనేది క్రీస్తు శకం, ఏడో శతాబ్ధం నుంచి వస్తుంది. ప్రధానంగా హింసకు గురయ్యే వారు దీని ద్వారా ఉప శమనం పొందుతారు. ఏడో శతాబ్ధం ఒంటెలు, జంతువులు, బంగారం లాంటివి బ్లడ్ మనీ కింద తీసుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు బ్లడ్ మనీ కేసులు
2017లో కేరళకు చెందిన ఏఎస్ శంకర్ నారాయణన్ తన ఇంట్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న (బంగ్లాదేశ్ కు చెందిన) కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే యూఏఈ జైలులో 8 సంవత్సరాలు గడిపాడు. 2 లక్షల దిరామ్స్ (రూ. 47 లక్షలు) చెల్లించాలని అదేశాలు వచ్చాయి. కానీ అతని వద్ద అంత డబ్బు లేదు. దీంతో ఒక వార్తా పత్రికలో ఆయన దీన స్థితిని ప్రచురించడంతో విరాళాలు పెరిగాయి. దీనికి తోడు ఓమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ కొంత డబ్బు ఇవ్వడంతో బయటపడ్డాడు.
2017లోనే సౌదీలో అక్కడి వ్యక్తిని తెలంగాణ వాసి లింబాద్రి హత్య చేసిన ఘటనలో ఉరిశిక్ష పడింది. పదేళ్లు జైలులో ఉన్న తర్వాత స్థానిక వ్యాపార వేత్త సాయంతో తెలంగాణ రాజకీయ నాయకురాలు కవిత జోక్యంతో లింబాద్రి ఇంటికి వచ్చాడు.
2014లో కూడా ముగ్గురు భారతీయులు, ఒక సౌదీ వ్యక్తి కలిసి బిజినెస్ చేయగా.. వారి మధ్య వచ్చిన విభేదాలతో ముగ్గురు భారతీయలు సౌదీ వ్యక్తిని హత్య చేశారు. నిందితులైన ముగ్గురికి అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. ఇందులో ఒక వ్యాపార వేత్త బ్లడ్ మనీ కింద రూ. 1.5 కోట్లు చెల్లించడంతో ముగ్గురు విడుదలయ్యారు.
రియాద్ లో తన యజమాని మైనర్ కొడుకు ప్రమాదవశాత్తు హత్య చేసినట్లు రుజువు కావడంతో కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కు కోర్టు ఉరి శిక్ష విధించింది. బాలుడి కుటుంబం రూ. 34 కోట్ల దియా (బ్లడ్ మనీ) చెల్లించడంతో మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు. మళయాలీ సమాజం విరాళంగా ఈ మొత్తాన్ని సేకరించింది. ఉరిశిక్షను తొలగించి 20 ఏళ్ల శిక్ష విధించారు. ఇందులో ఇప్పటికే అనుభవిస్తున్న కారాగార కాలం పరిగణలోకి తీసుకుంటే డిసెంబర్, 2026లో అబ్దుల్ రహీమ్ విడుదల కానున్నాడు.
