Begin typing your search above and press return to search.

సురేష్ గోపీకి మరోసారి బీజేపీ ఎంపీ టికెట్

కేరళలోని త్రిశూర్ లోక్ సభ స్థానం నుంచి మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి మరోసారి బరిలో దిగనున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:42 PM GMT
సురేష్ గోపీకి మరోసారి బీజేపీ ఎంపీ టికెట్
X

త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోయే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 195 మందితో కూడిన తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు చోటు దక్కించుకున్నారు. వారణాసి నుంచి మోడీ వరుసగా మూడోసారి పోటీ చేయబోతున్నారు. ఇక, గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యూ ఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సూరి స్వరాజ్ పోటీ చేయనున్నారు.

కేరళలోని త్రిశూర్ లోక్ సభ స్థానం నుంచి మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి మరోసారి బరిలో దిగనున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున త్రిసూర్ నుంచి పోటీ చేసిన సురేష్ గోపి ఓటమి పాలయ్యారు. ఇక, ఉత్తరప్రదేశ్ నుంచి హేమా మాలిని, రేసుగుర్రం ఫేమ్ రవి కిషన్ లోక్ సభ బరిలో నిలవబోతున్నారు. లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ పోటీ చేయబోతున్నారు. మన్ సుఖ్ మాండవీయా, జితేంద్ర సింగ్, సర్బానంద సోనోవాల్, గజేంద్ర సింగ్ షకావత్, భూపేందర్ సింగ్ యాదవ్, కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, జ్యోతిరాధిత్య సింధియా, అర్జున్ ముండా తదితరులు తొలి జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖులు.

ఇక తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, బీజేపీ తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలను అదే స్థానం నుంచి బరిలోకి దించుతోంది.

కరీంనగర్ - బండి సంజయ్

నిజామాబాద్ - ధర్మపురి అరవింద్

జహీరాబాద్ - బీబీ పాటిల్

మల్కాజ్ గిరి ఈటల రాజేందర్

సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి

భువనగిరి - బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్ - మాధవీలత

చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నాగర్ కర్నూల్ - పి. భరత్ (ఎస్సీ)