Begin typing your search above and press return to search.

బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ...బాబు అందులో ఉంటారా...!?

అంతే కాదు ఈ ఏడాది రామమందిరం ప్రారంభం తో పాజిటివ్ వేవ్ మళ్లీ బీజేపీ వైపుగా స్టార్ట్ అయింది అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:01 AM GMT
బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ...బాబు అందులో ఉంటారా...!?
X

టీడీపీ అధినేత చంద్రబాబు కమలం పార్టీతో పొత్తులకు చూస్తున్నారు. ఇది ఈ రోజు మాట కాదు 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత నుంచి ఆయన చూపు అటే ఉంది. అయితే ఈ మధ్యలో ఆయన కాస్తా మారారు అని వార్తలు వచ్చాయి. కానీ గత ఏడాది డిసెంబర్ లో దేశంలో పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రధాన రాష్ట్రాలను గెలుచుకుంది.

అంతే కాదు ఈ ఏడాది రామమందిరం ప్రారంభం తో పాజిటివ్ వేవ్ మళ్లీ బీజేపీ వైపుగా స్టార్ట్ అయింది అంటున్నారు. మోడీ ఇమేజ్ ప్లస్ హిందూత్వతో మళ్ళీ ఢిల్లీ పీఠం బీజేపీ కైవశం చేసుకుంటుంది అని అంటున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి నితీష్ బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలపడంతో పాటు ఇండియా కూటమిలో విభేదాలు పొడసూపుతున్నాయి.

ఎన్నికలు ముంగిట ఉన్న వేళ ఇండియా కూటమి ఇబ్బంది పడుతూంటే బీజేపీ బలపడుతోంది. దాంతో బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని టీడీపీ ఆలోచిస్తోంది. రేపటి రోజున ఏపీలో ప్రభుత్వం వచ్చినా కేంద్ర సాయం కావాలంటే బీజేపీతో ఎన్నికల ముందు పొత్తు ఉండడం మేలు అని కూడా భావిస్తోంది.

అందుకే ఇన్నాళ్ళ ప్రయత్నాలు ఒక ఎత్తు ఈసారి అమీ తుమీ అని చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ కి పొలిటికల్ గా చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పాలి. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనే భేటీ అవుతారు అని అంటున్నారు.

అయితే ఏపీకి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ అయింది అని అంటున్నారు. ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు 175 అసెంబ్లీ సీట్లలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ సిద్ధం అని అంటున్నారు. తమతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసి రమ్మని కోరుతున్నారుట. అయితే ఆయన మాత్రం టీడీపీతోనే అని అంటున్నారు. బీజేపీని కూడా తమతో పొత్తుకు రావాలని అంటున్నారు.

పవన్ విషయం చూస్తే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటేనే జగన్ ని గద్దె దింపగలమని భావిస్తున్నారు. అదే బీజేపీతో వెళ్తే మళ్లీ జగన్ వస్తారన్నది ఆయన అలోచన. కానీ బీజేపీ లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ చెస్తోంది. దాంతోనే బీజేపీ జనసేనలకు ఈ గ్యాప్ వచ్చేసింది.

ఇపుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దల మనసు మార్చే ప్రయత్నం చేస్తారా అంటే డౌటే అంటున్నారు. ఏపీలో టీడీపీ లేకుండా ఉంటేనే తాము ఎదగగలమని బీజేపీ భావిస్తున్న వేళ చంద్రబాబు ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయన్నది చూడాలి. ఇక అధికారంలో వాటా వంటి డిమాండ్లను కనుక బీజేపీ పెడితే దానికి బాబు అంగీకరిస్తారా అన్నది మరో ప్రశ్న.

ఏది ఏమైనా బీజేపీ రోడ్ మ్యాప్ మాత్రం సిద్ధంగానే ఉంది. అందులో తాను బాబు లేకుండా ఉండలేనని పవన్ అంటూంటే బాబు మాత్రం ముగ్గురూ ఉందామని చెబుతున్నారు ఈ పొత్తుల వ్యవహారం లెక్క తేలేది మాత్రం హస్తినలోనే. బీజేపీ అయితే మారేది లేదు అన్నదే ఆ పార్టీ వారు చాలా గట్టిగానే చెబుతున్న మాట.