Begin typing your search above and press return to search.

బీజేపీకి అధికారాన్ని అందించిన బ‌ల‌మైన అబ‌ద్ధం..!

మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌లో ప్ర‌ధాన ఆరోప‌ణ‌.. కాంగ్రెస్ ఏనేత‌ను న‌మ్ముకుని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైందో ఆ నేత‌కే వంద‌ల కోట్ల ముడుపులు అందాయ‌నేది

By:  Tupaki Desk   |   3 Dec 2023 8:47 AM GMT
బీజేపీకి అధికారాన్ని అందించిన బ‌ల‌మైన అబ‌ద్ధం..!
X

గెలిచే రాష్ట్రాన్ని కూడా.. కాంగ్రెస్ చేజేతులా పాడు చేసుకుందా? ఒక బ‌ల‌మైన అబ‌ద్ధాన్ని.. అంత్యంత బ‌లహీనంగా ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేసి.. త‌ప్పించుకోలేక చేతులు ఎత్తేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రాజ‌యం పాలైంది. వాస్త‌వానికి ఇక్క‌డి కాంగ్రెస్ సీఎం భూపేష్ భ‌గేల్‌కు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడిగా పేరుంది. ఈయ‌న పేరు.. ఒకానొక ద‌శ‌లో దేశం మొత్తం వ్యాపించింది.

విమ‌ర్శ‌ల‌కు, వివాదాల‌కు క‌డు దూరంగా ఉంటార‌ని కూడా భూపేష్‌కు పేరుంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. ఖ‌చ్చితంగా భ‌గేల్‌నే సీఎం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. నిజానికి ఈ ప్ర‌క‌ట‌న కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చేసేదే. అయితే.. ఈ వ్యూహానికి బీజేపీ ప్ర‌తివ్యూహం ప‌న్నింది. క‌చ్చితం గా పోలింగ్ తొలి ద‌శ‌కు నాలుగు రోజుల ముందు.. మ‌హాదేవ బెట్టింగ్ యాప్ వివాదాన్ని తెర‌మీదికి తీసుకువ చ్చింది. ప్ర‌ధాని మోడీ నుంచి అగ్ర‌నేత‌ల వ‌ర‌కు .. భారీ ఎత్తున దీనిని ప్ర‌చారం చేశారు.

మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌లో ప్ర‌ధాన ఆరోప‌ణ‌.. కాంగ్రెస్ ఏనేత‌ను న‌మ్ముకుని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైందో ఆ నేత‌కే వంద‌ల కోట్ల ముడుపులు అందాయ‌నేది. ఆయ‌నే సీఎం భూపేష్ భ‌గేల్‌. మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ కొరియ‌ర్ అల్ సిద్దికీ నుంచి 508 కోట్ల రూపాయ‌లు సీఎంకు అందాయ‌నేది బీజేపీ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఊహించ‌ని ఈ విప‌త్తు ను బ‌లంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నించ‌లేదు. దీనిని రాజ‌కీయ విమ‌ర్శ‌గా కొట్టిపారేసింది.

కానీ, ఈ విమ‌ర్శ‌.. సీఎం పై అవినీతి ముద్ర‌.. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప్ర‌భావం చూపించాయి. ఫ‌లితంగా 90 స్థానాలున్న ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో బీజేపీ 52 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అయింది. నిజానికి కాంగ్రెస్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త లేదు. సీఎంఅభ్య‌ర్థిపై కుటుంబ పాల‌న అనే ముద్ర లేదు. అయిన‌ప్ప‌టికీ.. చివ‌రి ద‌శ‌లో వ‌చ్చిన విప‌త్తును స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌లేక‌పోవ‌డంతో .. మ‌హాదేవ్ యాప్ ముంచేసింది.

కొస‌మెరుపు ఏంటంటే.. ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత‌.. మ‌హాదేవ్ యాప్ అవినీతి గురించి ఎక్క‌డా ఎవ‌రూ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం.. క‌నీసం దీనిపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం ఒక‌భాగం. ఇక‌, రెండోది ప్ర‌ధాని మోడీ ఎవ‌రిపై అయితే.. 508 కోట్లు ముడుపులు తీసుకున్నార‌ని ఆరోపించారో.. ఆ సీఎం కాంగ్రెస్ నేత‌, భ‌గేల్ ఎవరో కూడా త‌మ‌కు తెలియ‌ద‌ని యాప్ నిర్వాహ‌కులు కోర్టుకు చెప్ప‌డం!!