Begin typing your search above and press return to search.

మోడీ పొగ‌డ‌క‌పోవ‌డ‌మే శాపం.. సీఎం సీటు పోయిందే!

ఇక్క‌డ కూడా పార్టీ కోసం శ్ర‌మించి.. అనేక మాట‌లు ప‌డి.. పార్టీని గెలుపు తీరాల‌కు చేర్చిన మాజీ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ను ప‌క్క‌న పెట్టేసింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:30 AM GMT
మోడీ పొగ‌డ‌క‌పోవ‌డ‌మే శాపం.. సీఎం సీటు పోయిందే!
X

ఛ‌త్తీస్‌గ‌ఢ్ పార్టీ బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకుని.. కేవ‌లం 23 రోజుల్లో రాష్ట్ర మంతా తిరిగి బీజేపీని అధికారంలోకి తెచ్చిన మాజీ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్‌ను అగ్ర‌నాయ‌క‌త్వం సీఎం పోస్టు ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టిన వ్య‌వ‌హారం.. బీజేపీ నేత‌ల‌కు ఇంకా మింగు డు ప‌డ‌నేలేదు. అయితే.. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. త‌మ‌కెందుకు.. త‌మ‌వారైతే చాల‌నే ధోర‌ణితో ఉన్నారో ఏమో.. బీజేపీ పెద్ద‌లు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ ఇదే రాజ‌కీయ తంత్రానికి తెర‌దీశారు. ఇక్క‌డ కూడా పార్టీ కోసం శ్ర‌మించి.. అనేక మాట‌లు ప‌డి.. పార్టీని గెలుపు తీరాల‌కు చేర్చిన మాజీ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ను ప‌క్క‌న పెట్టేసింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను బీజేపీ ఎంపిక చేసింది. ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా కొత్త ఎన్నికైన ఎమ్మల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కాదని ఈ సారి పార్టీ అధిష్ఠానం మెహన్ యాదవ్ వైపు మొగ్గు చూపడంతో అంద‌రూ కొద్ది సేపు నివ్వెర పోయారు. అనంత‌రం తేరుకుని.. జై కొట్టారు.

చోటా నేత‌

మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన మోహన్ యాదవ్ చాలా చోటా నేత‌గా భావిస్తారు. అయితే.. ఆయ‌న‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల‌.. కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ద్వయం పాత్ర ఉంద‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌ మట్లాడారు. "నాలాంటి చిన్న నాయకుడికి బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో నా శక్తిమేరకు కృషి చేస్తాను" అని తెలిపారు.

పొగ‌డక‌పోవ‌డమే పాపం!

ఎన్నిక‌ల వ‌ర‌కు సీఎం పోస్టులో ఉన్న శివ‌రాజ్‌శింగ్ చౌహాన్‌.. పేద‌ల నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న చాలా సాదాసీదాగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరుకూడా ఉంది. ఎవ‌రితోనూ ఆయ‌న క‌య్యాలు పెట్టుకోరు. అలాగ‌ని ఎవ‌రినీ ఆయ‌న పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌రు. రాష్ట్రానికి అనేక మార్లు ప్ర‌ధాని మోడీ వ‌చ్చినా.. ఆయ‌న‌ను ప్రొటోకాల్ ప్రకార‌మే చూసుకున్నారు త‌ప్ప‌.. ఎదురేగి స్వాగ‌తాలు.. ప‌ల‌క‌డం, అతి చేయ‌డం శివ‌రాజ్ చేయ‌లేదు. అదేస‌మ‌యంలో అంద‌రూ రాముడి భ‌జ‌న చేస్తే.. ఆయ‌న ప్ర‌జా భ‌జ‌నే బాగుంటుంద‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యాఖ్యానించారు. ఇదే బీజేపీని తీరం దాటించింది. అయితే..ఇ లా మోడీని పొగ‌డ‌క‌పోవ‌డ‌మే పాపం అన్న‌ట్టుగా ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పీటం నుంచి ప‌క్క‌న పెట్టార‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.