Begin typing your search above and press return to search.

సరిగ్గా గురి చూసి కొడుతున్న బీజేపీ : మ్యానిఫెస్టోలో అట్రాక్షన్స్ !?

ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూండగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కో–కోఆర్డినేటర్‌గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 April 2024 3:42 AM GMT
సరిగ్గా గురి చూసి కొడుతున్న బీజేపీ :  మ్యానిఫెస్టోలో అట్రాక్షన్స్  !?
X

కేంద్రంలో వరసగా మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. దాంతో ఎన్నికల ప్రణాళికకు పదును పెడుతోంది. కేంద్ర రక్షణ మంత్రి, గతంలో బీజేపీకి ప్రెసిడెంట్ గా పనిచేసిన రాజ్ నాధ్ సింగ్ ఆద్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి చాలా పెద్ద కసరత్తునే చేసింది. ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూండగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కో–కోఆర్డినేటర్‌గా ఉన్నారు. మొత్తం 27 మందితో ఈ కమిటీ ఏర్పాటు అయింది.

బీజేపీ ఆషామాషీగా ఎన్నికల ప్రణాళికను తయారు చేయలేదు. ఆ పార్టీ తరఫున జనాలకు అప్పీల్ చేసింది. దేశానికి ఏది మంచో చెప్పమని సలహాలు ఇవ్వమని కోరింది. ఆ విధంగా చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా పదిహేను లక్షల వరకూ సలహాలు సూచనలు బీజేపీకి వచ్చాయి. వాటిలో నాలుగు లక్షల దాకా సలహాలు సూచనలు నమో యాప్‌ ద్వారా వచ్చాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా మరో పదకొండు లక్షల దాకా సూచనలు సలహాలు వీడియోల రూపంలో వచ్చాయని పేర్కొన్నారు.

వీటిని అన్నింటికీ క్రోడీకరిస్తూ అందులో ఉత్తమమైన వాటిని కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ పొందుపరుస్తోంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచితాలకు పెద్ద పీట వేసింది. సంక్షేమం అంటూ ముందుకు వచ్చింది. కానీ బీజేపీ అలా కాకుండా పూర్తిగా అభివృద్ధికే పెద్ద పీట వేస్తుందని అంటున్నారు.

దానికి 2047 డెవలప్ ఇండియా అన్న లీడ్ తీసుకుని మరీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేశారు అని అంటున్నారు. ఉచితాలకు దూరంగా అభివృద్ధికి దగ్గరగా బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని అంటున్నారు. రానున్న రెండు దశాబ్దాలు దేశానికి అత్యంత కీలకం అని బీజేపీ చెప్పనుంది. అభివృద్ధి చెందిన భారతాన్ని తాము ఆవిష్కరిస్తామని అది తమ వల్లనే సాధ్యమని బీజేపీ స్పష్టం చేయనుంది అంటున్నారు.

అభివృద్ధి భారతం కోసం ఏమి చేయాలో అన్నీ కూడా ఈ ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే రైతులకు యువతకు మహిళకు పేదలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. అదే విధంగా అభివృద్ధినే హైలెట్ చేస్తారు అని చెబుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఏడు దశలుగా సాగే లోక్ సభ ఎ ఎన్నికలు సంబంధించి చూస్తే తొలి విడత ఎన్నికలు ఈ నెల 19న మొదలవుతుంది. దాంతో ఈ నెల 14న అంటే ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్దా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వంటి వారు పాల్గొంటారు. అంటే తొలి విడత ఎన్నికలకు అయిదు రోజుల ముందు బీజేపీ హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అవుతోంది అన్న మాట.

దీని మీద జనంలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దేశ అభివృద్ధి భద్రత, ఆధ్యాత్మికత, దేశ సాంస్కృతిక వారసత్వం వంటివి ఈ మ్యానిఫెస్టోలో ఉంటాయని అంటున్నారు. దాదాపుగా తొంబై కోట్లకు పైగా ఓటర్లు ఈసారి ఎన్నికలలో ఓటు వేయబోతున్నారు. వారిని ఈ ఎన్నికల ప్రణాళిక ఏమేరకు ఆకట్టుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.