Begin typing your search above and press return to search.

పార్లమెంట్ రద్దు : సంచలనం దిశగా బీజేపీ...?

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి అంటే అఫీషియల్ గా చూస్తే కొన్ని బిల్లుల ఆమోదం అని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 6:33 AM GMT
పార్లమెంట్ రద్దు : సంచలనం దిశగా బీజేపీ...?
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి అంటే అఫీషియల్ గా చూస్తే కొన్ని బిల్లుల ఆమోదం అని చెబుతున్నారు. కానీ రాజకీయంగా చూస్తే చాలా ప్రాముఖ్యత ఈ స్పెషల్ సెషన్స్ అని అంటున్నారు. దేశంలో అత్యంత సంచలన నిర్ణయం దిశగా బీజేపీ ఈ పార్లమెంట్ సమావేశాలలో అడుగులు వేయవచ్చు అని అంటున్నారు.

ఈ నెల 22 వరకూ అంటే అయిదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలలో మహిళా బిల్లు ఆమోదిస్తారా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అలాగే యూనీఫాం సివిల్ కోడ్ బిల్లు సభ ముందుకు వస్తుంది అని అంటున్నారు మరో వైపు చూస్తే ఈ మీటింగ్స్ లో జమిలి ఎన్నికల గురించి చర్చకు రావచ్చు అని వినిపిస్తోంది. ఇండియాను భారత్ గా మార్చేందుకు కూడా ఈ స్పెషల్ సెషన్ కీలకంగా మారుతుంది అంటున్నారు.

ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ సెషన్ లోనే బాంబు లాంటి వార్తతో విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని అంటున్నారు. అదే పార్లమెంట్ రద్దు. గట్టిగా చూస్తే కేంద్రంలోని బీజేపీని ఎనిమిది నెలలకు పైగా సమయం ఉంది. కానీ సడెన్ గా బీజేపీ ఆలోచనలలో మార్పు కంపిస్తోంది

అది కూడా కర్నాటక ఎన్నికల్లో దెబ్బ తిన్న తరువాత అని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ ని నిలువరించలేక చతికిలపడిన కమలం పార్టీకి ముంగిట్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కనిపిస్తున్నాయి. అందులో అతి పెద్ద స్టేట్ మధ్యప్రదేశ్. ఇక్కడ మూడు దఫాలుగా బీజెపీ అధికారంలో ఉంది. దాంతో విపరీతమైన యాంటీ ఇంకెంబెన్సీ పెరిగింది. 2018లో కాంగ్రెస్ గెలిచినా బీజేపీ ఆ సర్కార్ ని పడగొట్టి మరీ అధికారాన్ని అందుకుంది.

దాంతో జనాలలో ఆ సానుభూతి కూడా ఉంటుంది. సో ఎలా చూసుకున్నా మధ్యప్రదేశ్ బీజేపీకి దక్కేలా లేదు అంటున్నారు. రాజస్థాన్ లో బీజేపీలో కుమ్ములాటలు కాంగ్రెస్ కి ప్లస్ అవుతాయాన అన్న చర్చ ఉంది. తెలంగాణాలో ఎటూ కాంగ్రెస్ బీయారెస్ ల మధ్య ఫైట్ అని తెలిసిపోతోంది. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ని మొగ్గు ఉంది. మెఘాలయాలో లో ఎవరు గెలిచినా లెక్కలోకి రాదు.

దాంతో బీజేపీ కనుక ఈ అయిదు రాష్ట్రాలలో వ్యతిరేక ఫలితాలు అందుకుంటే పరువు పోతుంది అని భయపడుతోంది అంటున్నారు. ఆ ప్రభావం కచ్చితంగా 2024 ఎన్నికల మీద పడుతుందని ఊహిస్తోంది. అందుకే గుప్పిట మూసి ఉంచాలని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు రాకుండానే లోక్ సభ ఎన్నికలు జరిగిపోవాలని ఊఒస్తోంది అంటున్నారు.

అలా జరగాలీ అంటే పార్లమెంట్ రద్దు చేయడం ఒక్కటే మార్గం తప్ప మరోటి కానే కాదు అని అంటున్నారు. అలా కనుక చేయకపోతే ఏ కారణం చెప్పి డిసెంబర్ లో జరగాల్సిన ఎన్నికలను వచ్చే ఏడాది వరకూ వాయిదా వేయగలరు అని అంటున్నారు. ఎలా చూసుకున్నా బీజేపీ ముందు పార్లమెంట్ రద్దు అన్న అస్త్రమే ఉంది అని అంటున్నారు.

దీని వల్ల లాభాలు ఏంటి అంటే ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం స్టేట్స్ మీద పడి మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి పెద్ద స్టేట్స్ ని బీజేపీ దక్కించుకునే వీలు ఉంది అంటున్నారు. అలాగే తెలంగాళాలో తన పెర్ఫార్మెన్స్ ని మరింతంగా పెంచుకునే వీలు ఉంది అని అంటున్నారు.

అలాగే చత్తీస్ ఘడ్ లో కూడా సీట్లు పెంచుకుంటే మేఘాలయాలో అధికారాన్ని గత రెండు దఫాలుగా అనుభవిస్తోంది. ఇపుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇలా బీజేపీ ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి. పార్లమెంట్ రద్దు చుట్టూ తిరుగుతున్నాయని అంటున్నారు. పార్లమెంట్ రద్దు అయితే మాత్రం దేశ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం నమోదు అవుతుంది అని అంటున్నారు.