Begin typing your search above and press return to search.

కేంద్రం తీసుకున్నమరో సంచలన నిర్ణయం

ఈ మేరకు కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. దీంతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది

By:  Tupaki Desk   |   11 March 2024 1:13 PM GMT
కేంద్రం  తీసుకున్నమరో సంచలన నిర్ణయం
X

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న బీజేపీ మరోమారు మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరిలో ఆశ్చర్యం నింపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో వచ్చే సార్వత్రిక మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది.

వివాదాస్పదమైన బిల్లులు తీసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుంటారు. జమ్ము కశ్మీర్ లో 370 అధికరణ అయితేనేమీ, చైనాతో కయ్యానికి కాలు దువ్వడంలో అయితేనేమీ, పాకిస్థాన్ తో సర్జికల్ దాడులైతేనేమీ మోదీ తీసుకునే నిర్ణయాలు ప్లస్ గానే మారుతున్నాయి. ఈనేపథ్యంలో మరో సంచలన నిర్ణయం కేంద్రం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. సీఏఏ చట్టం బీజేపీ ప్రతిష్టను ఇనుమడిస్తుందా? దిగజారుస్తుందా? దీన్ని ప్రతిపక్షాలు ఎలా ఉపయోగించుకుంటాయనే వాదనలు బలంగా వస్తున్నాయి.

2014 డిసెంబర్ 31కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ వంటి దేశాల నుంచి హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు తదితర మతాల వారు వలస వచ్చారు. వారికి పౌరసత్వం ఇవ్వాలని చట్టం తీసుకొచ్చింది. కానీ ఇందులో ముస్లింలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వివాదానికి తావిస్తోంది. దీనిపై గొడవలు నెలకొనే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది.

మతపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాన్ని అయినా సులభంగా తీసుకోవడం దాని నైజం. ఈక్రమంలో బీజేపీ తీసుకునే నిర్ణయం ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. మతపరమైన ఇబ్బందులు తీసుకురావడంలో వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ మేరకు తన నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

బీజేపీ తీసుకునే నిర్ణయం ప్రజల్లో అలజడి కలిగిస్తుందా? ముస్లింలలో ఆగ్రహావేశాలు పెంచుతుందా? బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టనుందా? అనే కోణంలో రాజకీయ పక్షాలు ఆలోచిస్తున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్లడం బీజేపీకే సాధ్యమవుతుందని పలువురి వాదన. దీంతో బీజేపీ తీసుకునే ఈ నిర్ణయం ఎలాంటి గొడవలకు కారణమవుతుందో తెలియడం లేదు.

సీఏఏ చట్టం ఇప్పుడే ఎందుకు అమలు చేయాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలు ఏంటి? ఇన్నాళ్టు చట్టం ఎందుకు అమలు చేయలేదనే కోణంలో ఆలోచిస్తే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మతపరమైన ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఆదరబాదరగా ఈ చట్టం అమలు చేయడానికి ముందుకొచ్చిందని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి అమిత్ షా దీనిపై ప్రకటనలు చేస్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ కు రెండు రోజుల ముందే పార్లమెంట్ లో ఆమోదం పొందడం వివాదానికి కేంద్రమవుతోంది.

దీనిపై విమర్శలు వస్తున్నాయి. మైనార్టీల కోసం ఉద్దేశించిందే అయినా అందులో ముస్లింలను తొలగించడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇది ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందో లేక మైనస్ అవుతుందో అనే కోణంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలులో ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో చూడాల్సిందే.