Begin typing your search above and press return to search.

రాహుల్ దూకుడు క‌ళ్లెం.. బీజేపీ హైలెవిల్ స్ట్రాట‌జీ!

ఈ ప‌రిణామాన్ని.. తాను చేస్తున్న యుద్ధంలో తొలి విజ‌యంగా రాహుల్‌గాంధీ భావిస్తున్నారు.

By:  Garuda Media   |   16 Aug 2025 12:16 PM IST
రాహుల్ దూకుడు క‌ళ్లెం.. బీజేపీ హైలెవిల్ స్ట్రాట‌జీ!
X

`ఓట్ల చోరీ` నినాదంతో దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి తెర‌దీసిన కాంగ్రెస్ పార్ట అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయకుడు రాహుల్ గాంధీ దూకుడుకు క‌ళ్లెం వేసేలా.. బీజేపీ హైలెవిల్ స్ట్రాట‌జీని రెడీ చేస్తున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ర్సెస్ రాహుల్ గాంధీల మ‌ధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో ఎన్నిక‌ల సంఘానికి కొంత ఎదురు దెబ్బ త‌గిలింది. బీహార్‌లో అన‌ర్హులుగా పేర్కొన్న 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని.. వారి వివ‌రాలు చెప్పాల‌ని ఆదేశించింది.

ఈ ప‌రిణామాన్ని.. తాను చేస్తున్న యుద్ధంలో తొలి విజ‌యంగా రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు.. రాహుల్ రోజు రోజుకు చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆయ‌న ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కు ప్ర‌జ‌ల్లోనూ స్పంద‌న బాగానే ఉంది. మ‌రోవైపు.. ఆన్‌లైన్‌లోనూ.. దేశ‌వ్యాప్తంగా 50 కోట్ల మందిని ఈ ఉద్య‌మం దిశ‌గా ముందుకు న‌డిపించేందుకు రాహుల్ గాంధీ ప్ర‌త్యేక స్ట్రాట‌జీని అమ‌లు చేస్తున్నారు.

`ఓట్ చోర్‌` పేరుతో రూపొందించిన యాప్‌లో ప్ర‌జ‌ల‌ను చేరుస్తున్నారు. దీనిని సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించ డం ద్వారా ప్ర‌జ‌లు కూడా ఎన్నిక‌ల సంఘంపై అనుమానాలు ఉన్నాయ‌ని చెబుతున్నార‌ని, దీనిపై చ‌ర్య లు తీసుకోవాల‌ని రాహుల్ కోరే అవ‌కాశంఉంది. అంటే.. మోడీ ఇజ్జ‌త్‌కు ఇది ప్ర‌ధాన స‌వాలుగా మార‌నుం ద‌న్న‌ది బీజేపీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. అక్ర‌మంగా గెలిచి అధికారంలోకి వ‌చ్చార‌న్న రాహుల్ వాద‌న‌కు బ‌లం చేకూరితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డిన ప్ర‌యాస‌, చేసిన మంచి అంతా పోయిన‌ట్టేన‌ని క‌మ‌ల నాథులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉన్న‌త‌స్థాయిలో నాయ‌కులు శుక్రవారం రాత్రి భేటీ నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం. దీనిపై జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వస్తున్నాయి. పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసేలోగానే.. దీనికి బ‌ల‌మై న వ్యూహంతో చెక్ పెట్టేలా వ్యూహాలు రెడీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌ల్లోకి తాము కూడా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఓట్ల చోరీ జ‌రిగి ఉంటే.. రాహుల్ ఎలా విజ‌యంద‌క్కించుకు న్నారు?, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో ఎలా అధికారంలోకి వ‌చ్చారు? అనే విష‌యాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి హైలెవిల్ స్ట్రాట‌జీ అయితే.. చేప‌ట్ట‌నున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.