Begin typing your search above and press return to search.

కేరళలో లెఫ్ట్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందా ?

కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కి మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది.

By:  Satya P   |   1 April 2026 9:30 AM IST
కేరళలో లెఫ్ట్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందా ?
X

కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కి మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ఈ రెండు కూటముల మధ్య సీట్ల ఓట్ల షేర్ అయితే పెద్దగా తేడా అయితే లేదు. అయిదారు సీట్ల వ్యత్యాసం రెండింటి మధ్య ఉందని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఓటు షేర్ చూసినా రెండు శాతమే తేడా ఉంది. ఎన్నికలకు గడువు దగ్గర పడిన వేళ ఈ కొద్ది సమయంలో ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది. అయితే కేరళలో కొత్తగా బీజేపీ రంగ ప్రవేశం చేసింది. దాంతో ఓట్ల చీలిక అన్నది ఈసారి పెద్ద ఇష్యూగా మారింది.

భారీగానే ఓటు షేర్ :

నువ్వా నేనా అన్నట్లుగా రెండు కూటములు తలపడుతున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అయితే ఏకంగా 14 నుంచి 16 శాతం ఓటు షేర్ ని అందుకుంటుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా కీలకంగా ఉంది ఎందుకంటే రెండు శాతం ఓటు షేర్ వ్యత్యాసంతోనే అధికార ప్రతిపక్ష కూటములు రాజకీయంగా భీకర పోరు సాగిస్తున్నాయి. దాంతో ఈ ఓటు షేర్ ఉంచి ఏ మాత్రం ఒక కూటమి నుంచి బీజేపీ తీసుకున్నా రెండవ పక్షం ఘన విజయం సాధిస్తుంది. దాంతో కేరళ ఎన్నికల ప్రచారంలో ఇపుడు బీజేపీ ప్రధాన అంశం అయింది.

లెఫ్ట్ కే బీజేపీ మద్దతు :

ఇదిలా ఉంటే కేరళలో లెఫ్ట్ పార్టీలు గెలవాలని బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రిని రక్షిస్తున్నారు అని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మతాన్ని దేవుడిని తెచ్చే బీజేపీ నేతలు కేరళలో మాత్రం శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగినా కూడా ఎన్నికల్లో ఆ అంశాన్నే మరచిపోయారని విమర్శించారు. దానికి కారణం లోపాయికారీగా లెఫ్ట్ కూటమితో బీజేపీకి పొత్తు ఉండడమే అన్నారు.

కాంగ్రెస్ ని దూరం పెట్టి :

కేరళలో బీజేపీ వ్యూహం ఏంటి అంటే కాంగ్రెస్ ని దూరం పెట్టి లెఫ్ట్ కూటమిని గెలిపించాలని అంటున్నారు రాహుల్ గాంధీ. తమ కూటమిని గెలిపించకుండా చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. కేరళలో లెఫ్ట్ బీజేపీల మధ్య ఒక విచిత్రమైన అవగాహన ఉందని అది నచ్చని సీపీఎం నాయకులు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడమే ఉదాహరణ అని రాహుల్ గాంధీ గుర్తు చేస్తున్నారు. బీజేపీ మోడీకి కావాల్సింది కాంగ్రెస్ ని దూరం పెట్టడం అని ఆయన అంటున్నారు.

నయా వ్యూహమా :

నిజానికి సిద్ధాంతాల పరంగా చూస్తే లెఫ్ట్ రైట్ వింగులుగా వామపక్షాలు బీజేపీ ఉంటాయి. రెండింటి ఫిలాసఫీ వేరు. ఈ రెండు పార్టీలూ ఎపుడూ కలిసింది లేదు, కానీ దేనిని అయినా రాజకీయ వ్యూహాలు కలిపేస్తాయని అంటున్నారు కేరళలో లెఫ్ట్ కూటమి గెలిస్తే బీజేపీకి సంతోషం అన్న రాహుల్ గాంధీ విమర్శలే తీసుకుంటే అందులో సహేతుకత ఉందనే అంటున్నారు. లెఫ్ట్ పార్టీలకు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే. దాంతో వారు దేశవ్యాప్తంగా ప్రభావం చూపించలేరు. అదే కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ నాయకత్వం మరింతగా పటిష్టం అవుతుంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ విధంగా చేస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది ఫలితాల సరళిని బట్టి తేలనుంది.