ఏపీ ఫ్యూచర్ లీడర్స్ మీద బీజేపీ ఫోకస్
ఏపీలో బీజేపీకి ఏమి ఉంది ఎంత వరకూ బలం ఉంది అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారికి అన్నీ తెలుసు. బీజేపీ ఇచ్చేది పొత్తులలో నైతిక మద్దతు మాత్రమే.
By: Tupaki Desk | 18 May 2025 5:37 PM ISTఏపీలో బీజేపీకి ఏమి ఉంది ఎంత వరకూ బలం ఉంది అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారికి అన్నీ తెలుసు. బీజేపీ ఇచ్చేది పొత్తులలో నైతిక మద్దతు మాత్రమే. ఇక గ్రౌండ్ లో బీజేపీకి పెద్దగా బలం లేదు, అంతే కాదు సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు రావు అన్నది కూడా తెలుసు.
అయితే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఆ పార్టీని దాటుకుని సమీప భవిష్యత్తులో ముందుకు వెళ్ళేందుకు మరో ఆల్టర్నేటివ్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో లేకపోవడం బీజేపీకి వరంగా ఉంది. ఈ నేపధ్యంలో బీజేపీ కేంద్రంలో బలంగా ఉండడమే ఏపీ లాంటి చోట్ల ఆ పార్టీ పొత్తు రాజకీయాలకు రాయబేరాలకు ఎంగతానో ఉపయోగపడుతోంది.
మరో వైపు చూస్తే బీజేపీ పొత్తులలోనే ఎపుడూ గెలుస్తూ వస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఏర్పాటు అయ్యాక బీజేపీకి అప్పటిదాకా ఉన్న ఓటు బ్యాంక్ అటు టర్న్ అయింది అలా టర్న్ అయిన ఓటు బ్యాంక్ ని బీజేపీ తిరిగి పొందలేకపూఅతోంది. దాంతో టీడీపీతోనే ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో పొత్తు పెట్టుకునే సీట్లూ ఓట్లూ తెచ్చుకుంటోంది.
తమాషా ఏంటి అంటే ఏపీలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా చెలిమి చేసేందుకు యత్నించడానికి చూడడమే. 2014 నుంచి 2018 దాకా బీజేపీ టీడీపీ ఘట బంధన్ కొనసాగించి. ఇక అదే టైంలో వైసీపీతో కూడా బీజేపీ సాఫ్ట్ కార్నర్ తో ఉంటూ వచ్చింది బహుశా ఇలాంటి అనుమానాలే బీజేపీతో టీడీపీ 2018లో కటీఫ్ ఇవ్వడానికి కారణం అయ్యాయని చెప్పాలి.
ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అలా బీజేపీతో పరోక్షంగా వైసీపీ స్నేహంగా ఉందని అంతా అనుకున్నారు ఇక 2024లో చూస్తే జనసేన టీడీపీలతో బీజేపీ చేతులు కలిపి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఇక చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో బీజేపీ ఏపీ పాలిటిక్స్ లో ఫ్యూచర్ లీడర్స్ గా జగన్ ని పవన్ ని చూసేది. 2020లోనే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో మరో రెండు దశాబ్దాలకు పైగా రాజకీయం చేసే బలమైన రాజకీయ నేతలు యువ నేతలు కావాల్సి వచ్చిందని అంటారు.
అలా జగన్ తో ఒక వైపు పవన్ తో మరో వైపు బీజేపీ ఉంటూ వచ్చిందని ప్రచారంలో ఉంది. ఇక 2024లో చూస్తే పవన్ తో పూర్తిగా మితృత్వం ప్రదర్శిస్తూ వస్తున్న బీజేపీ ఇటీవల కాలంలో టీడీపీలో యువ నేత భావి నాయకుడు అయిన లోకేష్ ని కూడా చేరదీయడాన్ని అంతా చూస్తున్నారు. తన వద్దకు కోరి ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించుకోవడాన్ని చూసిన వారు అంతా ఏపీలో యూత్ లీడర్స్ మీద బీజేపీ ఫోకస్ చేస్తోంది అని అంటున్నారు.
ఇక చూస్తే కనుక లోకేష్ లోని నాయకత్వ లక్షణాలను కూడా గమనిస్తూ వస్తున్న బీజేపీ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యానే ఆయనతో కూడా మంచి అనుబంధం పెనవేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు ఇక ఇక్కడ చూస్తే వైసీపీ అధినేత జగన్ మీద బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీతో ఏ విధనా బీజేపీ సాఫ్ట్ కార్నర్ చూపించినా అసలు సహించరు అని అంటారు.
అయితే జాతీయ రాజకీయాలలో గండర గండడుగా పేరు గడించిన బీజేపీ ఏపీ రాజకీయాల్లో తనకు ఏది అనుకూలమో చూసుకుని తప్పకుండా చేస్తుందని భావిస్తున్నారు. అయితే జగన్ పాలనలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. దీని మీద ఈడీ కూడా చూపు చూస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు ఏమిటి అన్నవి తొందరలోనే తెలుస్తాయని అంటున్నారు
ఏది ఏమైనా చంద్రబాబుని సీనియర్ పొలిటీషియన్ గా భావిస్తున్న బీజేపీ భవిష్యత్తులో తాను బలపడాలీ అంటే ఫ్యూచర్ లీడర్స్ తోనే చెలిమి చేయాలని లెక్క వేసుకుని మరీ కొత్త రాజకీయాలకు తెర తీస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన కనుక రాజకీయ విశ్రాంతిని కోరుకుంటే బీజేపీ తరువాత తరం నేతలతో తనదైన రాజకీయాలను చాలా ఈజీగా పండించుకుంటూ ముందుకు అడుగులు వేస్తుందని అంటున్నారు. మరి బీజేపీ ఆశలు నెరవేరుస్తూ ఆ పార్టీ బంధంలో దీర్ఘ కాలం ప్రయాణం చేసే నమ్మకమైన యువ నేత ఏపీలో ఎవరు అన్నదే చర్చగా ఉంది.
