Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో మోడీ స్టాండ్ అదేనా ?

ఒక ఏడాది కాలంలో తీసుకుంటే టీడీపీ జగన్ మీద వైసీపీ మీద చాలానే టార్గెట్ చేసింది వైసీపీకి చెందిన అనేక మంది నేతల మీద కేసులు పడ్డాయి.

By:  Tupaki Desk   |   15 Jun 2025 8:00 AM IST
జగన్ విషయంలో మోడీ స్టాండ్ అదేనా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి అయింది. కూటమి ఏర్పడి సక్సెస్ ఫుల్ గా విజయం సాధించడం వెనక కేంద్రంలోని బీజేపీ దానిని నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా కీలకమైన పాత్ర పోషించిన సంగతి విధితమే. ఇక ఏపీలో కూటమి కట్టిన తర్వాత బీజేపీకి ఎన్నడూ లేని విధంగా 8 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అలాగే రాష్ట్రంలో ఒక మంత్రి పదవి దక్కింది.

అలాగే ముగ్గురు లోక్ సభ సభ్యులను బీజేపీ గెలుచుకుంది. అదే విధంగా రెండు రాజ్యసభ సీట్లు ఒక ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంది. దాంతో బీజేపీకి కూటమి కట్టాక భారీ రాజకీయ ప్రయోజనమే దక్కింది. అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ పోషించే పాత్ర ఏమిటి, ఆ పార్టీ ఏపీలో కూటమికి రాజకీయంగా ఎంతవరకు సహకరిస్తోంది అన్నదే ఒక చర్చగా ఉంది.

ఒక ఏడాది కాలంలో తీసుకుంటే టీడీపీ జగన్ మీద వైసీపీ మీద చాలానే టార్గెట్ చేసింది వైసీపీకి చెందిన అనేక మంది నేతల మీద కేసులు పడ్డాయి. చాలా మంది జైలు పాలు అయ్యారు. అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తున్న బీజేపీ నుంచి పెద్దగా రియాక్షన్ అయితే లేదనే అంటున్నారు.

అదే సమయంలో ఏపీలో మొదట తిరుపతి లడ్డూ విషయంలో కూటమి వైసీపీని జగన్ ని టార్గెట్ చేసింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని తీవ్రమైన ఆరోపణ చేసింది. అయితే దాని మీద టీడీపీ జనసేన వ్యవహారాన్ని పీక్స్ కి తీసుకెళ్ళాయి కానీ బీజేపీ నుంచి ఒక మాదిరి స్పందన మాత్రమే లభించింది.

ఆ తరువాత ఏపీని అప్పుల కుప్ప చేసి పారేసింది వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ ఆరోపిస్తూ వెళ్ళింది. అంతే కాదు అసెంబ్లీ లోపలా బయటా అనేక విధాలుగా నంబర్లు చెప్పి వైసీపీని కార్నర్ చేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ పరిమితంగానే రియాక్ట్ అయింది. చివరిగా చూస్తే మరో కీలక అంశం గా లిక్కర్ స్కాం ఉంది.

ఇందులో కేసుల మీద కేసులు పెట్టారు. ఆఖరుకు ఎందాకా వెళ్ళింది అంటే జగన్ అరెస్ట్ అని ఒక దశలో భారీ ఎత్తున ప్రచారం సాగింది. చివరికి అది కూడా ఆగింది. అయితే ఈ మూడు విషయాలు అన్నింటిలోనూ టీడీపీదే అతి ఉత్సాహం గా కనిపిస్తోంది కానీ బీజేపీ నుంచి అయితే ఆ స్థాయిలో రీసౌండ్ లేదని అంటున్నారు.

బీజేపీ ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తోంది. బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ తాను రాజకీయంగా బలపడాలి, తాను ఎదగాలి అన్నదే ఆ పార్టీ వ్యూహం. దాని కోసం కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం అయిపోకుండా దీర్ఘకాలంగా కార్యాచరణతో బీజేపీ ఉంటుందని అంటున్నారు.

అందుకే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల రాజకీయ అజెండాను బీజేపీ అనుసరించదని చెబుతున్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో జాతీయ దృక్పధంతో ఆలోచిస్తుంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే మూడు ప్రాంతీ పార్టీలు ఉన్నాయి. ఈ మూడూ ఒక విధంగా బీజేపీకి సన్నిహితమైనవే అన్నది విశ్లేషణగా ఉంది.

దాంతో ఏపీలో తన పట్టుకుని సాధించాలంటే ఎప్పటికి ఏది అవసరమో దానిని బట్టే ముందుకు సాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని అంటున్నారు. ఇక చూస్తే మే 2న అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి వచ్చిన ప్రధాని మోడీ అయితే వైసీపీ మీద జగన్ మీద ఏ రకమైన విమర్శలు చేయలేదని గుర్తు చేస్తున్నారు.

నిజానికి కూటమికి ప్రత్యర్ధి వైసీపీనే. కానీ ఆ ప్రస్తావన తేవడం వల్ల విమర్శల వల్ల బీజేపీకి కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదు. అందుకే పూర్తి వాస్తవిక ధోరణిలోనే ఆలోచిస్తూ ఏపీలో బీజేపీ తనదైన విధానంతో ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మరో నాలుగేళ్ళలో ఎన్నికలు ఉంటాయి. అలా చూస్తే భవిష్యత్తు వ్యూహాలే బీజేపీకి ముఖ్యమని అంటున్నారు.

అందుకే ఏపీలో వైసీపీ టీడీపీకి రాజకీయంగా బద్ధ శత్రువుగా ఉన్నా రు. అదే సమయంలో బీజేపీ వైపు నుంచి చూస్తే టీడీపీ రాజకీయ విధానాలతో ముందుకు సాగాల్సిన అవసరం లేదన్న భావన ఉందని ప్రచారం అయితే సాగుతోంది అంటున్నారు. సో ఈ ఏడాదిలో బీజేపీ వైపు నుంచి భారీ విమర్శలు లేకపోవడం వైసీపీకి బిగ్ రిలీఫ్ అంటున్నారు. అయితే ఇదే పరిస్థితి ముందు సాగుతుందా అంటే ఎవరూ చెప్పలేరు, ముందే చెప్పుకున్నట్లుగా బీజేపీవి దీర్ఘ కాలిక వ్యూహాలు.