మాధవ్ సైలెంట్ వార్.. నేతలకు గీతోపదేశం.. !
తాజాగా ఆయన చెబుతున్న మాటలను బట్టి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు.
By: Garuda Media | 30 Aug 2025 4:00 PM ISTబీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్.. సైలెంట్ వార్ ప్రారంభించారా? .. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు.. పార్టీని విస్తృత పరిచే ప్రణాళికలను ఆయన అమలు చేయాలని భావిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఆయన చెబుతున్న మాటలను బట్టి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు .. పార్టీ నగరాలకు.. కొన్ని మండలాలకు మాత్రమే పరిమితమైంది.ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ, ఇప్పుడు గ్రామీణ, మండల స్థాయిలోనూ పార్టీని పుంజుకునేలా చేయాలన్నది మాధవ్ నిర్ణయం. తాజాగా ఆయన ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ''వచ్చే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలాగైనా మారొచ్చు. మన కాళ్లపై మనం నిలబడాలి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాటం చేయాల్సిందే. గ్రామీణ స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయాలి. ఈ విషయంలో అందరూ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచే యాలి.'' అని నేతలకు గీతోపదేశం చేశారు. తద్వారా పార్టీ ఒంటరిగా అయినా గెలిచే సామర్థ్యం ఉంటుందని ఆయన భావన.
ఏ పార్టీ అయినా.. ఒంటరిగానే బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, బీజేపీ విషయంలో ఆది నుంచి కూడా.. టీడీపీపై ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తు న్నారు. వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య సఖ్యత లేదన్న వాదన. ఇది వాస్తవమే. కానీ, దీనికి ఒక్క బీజేపీ మాత్రమే అతీతంగా ఉందా? అంటే... అది కూడా లేదు. బీజేపీ నేతలు గెలిచిన చోట కూడా.. వివాదాలు జరుగుతున్నాయి.
బీజేపీ ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఏకఛత్రాధి పత్యంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని ముందుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా.. ఇతర పార్టీలపై నెపం నెట్టి.. తా ము మాత్రమే పవిత్రంగా ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నం సరికాదు. ఇక, గ్రామ స్థాయిలో పార్టీ పుంజుకు నే విషయం కూడా అంత ఈజీ కాదు. మాధవ్ చెబుతున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకునేందుకు ముందు స్థానికంగా సభ్యత్వాలే లేవు. అనేక చోట్ల పార్టీ పేరు కూడా వినిపించడం లేదు. అందుకే.. గత చీఫ్‌లు మౌనంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు మాధవ్ మాత్రం గీతోపదేశం బాగానే చేశారు. మరి ఏమేరకు పుంజుకుంటారో చూడాలి.
