Begin typing your search above and press return to search.

బీజేపీ డోర్స్ ఓపెన్ చేస్తే జరిగేది అదేనా ?

అంతే కాదు అలా వచ్చిన వారితో పెళ్ళి వారి ఇల్లులా పార్టీ కళకళలాడి పోనూవచ్చు. అందుకే డోర్స్ ఓపెన్ చేయమంటున్నారు బీజేపీ పెద్దలు.

By:  Satya P   |   10 July 2026 1:00 AM IST
బీజేపీ డోర్స్ ఓపెన్ చేస్తే జరిగేది అదేనా ?
X

ఈ డోర్స్ ఓపెన్ చేయడమేంటి ఎక్కడ అసలు ఎందుకు ఈ ప్రశ్నలు అందరిలో వెంటనే వస్తాయి. అయితే ఇవి మామూలు డోర్స్ కావు, రాజకీయ డోర్స్. అవి ఓపెన్ అయితే వచ్చేది సాధారణ జనాలు కాదు, ఢక్కామెక్కీలు తిన్న రాజకీయ జనాలు. అందుకే ఆ డోర్స్ కి అంతటి విలువ. అవి ఒక్కసారి తెరచుకుంటే గదులు భవనాలు పట్టనట్లుగా జనాలు వచ్చి పడవచ్చు. అంతే కాదు అలా వచ్చిన వారితో పెళ్ళి వారి ఇల్లులా పార్టీ కళకళలాడి పోనూవచ్చు. అందుకే డోర్స్ ఓపెన్ చేయమంటున్నారు బీజేపీ పెద్దలు.

నడ్డా సంచలన వ్యాఖ్యలు :

తాజాగా తెలంగాణా బీజేపీ నేతలతో సమావేశం అయిన కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా కీలక సూచనలు చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఆలస్యం అంటూ వారిని కంగారు పెట్టారు. బీజేపీ డోర్స్ ఓపెన్ చేయండి అని గట్టిగానే చెప్పారు. ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలుగా చాలా మంది బయట వెయింటింగ్ అని కూడా సలహా ఇచ్చారు. ఇతర పార్టీల నేతలు అంతా ఇపుడు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని జేపీ నడ్డా చెప్పడం విశేషం.

విసిగిపోయారు అంటూ :

తెలంగాణా రాజకీయాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుతో జనాలు విసిగిపోయి ఉన్నారు అని కూడా నడ్డా టీ బీజేపీ నేతలతో చెప్పారు. అందుకే ఇతర పార్టీల నేతల చూపు అంతా కమలం పార్టీ మీదనే ఉంది అని ఆయన అంటున్నారు. ఈ విధంగా వచ్చిన వారిని వెంటనే చేర్చుకోవాలని కూడా ఆయన దిశా నిర్దేశం చేసారు. వచ్చిన వారిని వచ్చినట్లే కాషాయం కండువా కప్పేసి చేర్చుకోవాలని కూడా నడ్డా కోరారు.

విభేదాలు పక్కన పెట్టి :

తెలంగాణా బీజేపీలో వర్గ పోరు గట్టిగానే ఉంది. పాత కొత్త నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. అంతే కాదు ఎవరికి వారుగా యమునా తీరుగా పార్టీ ఉంది. దాంతో నడ్డా బీజేపీ నేతలకు సూచనలు కూడా చేశారు. మీ మధ్య ఏమున్నా ఎన్ని ఉన్నా ఆ విభేదాలను పక్కన పెట్టేసి పార్టీ కోసం జట్టుగా కలసి కట్టుగా పనిచేయాలని కోరారు. అంతా కలసి ఒక్కటిగా పనిచేస్తే కనుక తప్పకుండా బీజేపీకి మంచి రోజులు వస్తాయని నడ్డా నమ్మకంగా చెప్పారు.

బీజేపీలోకి వరదేనా :

ఇదిలా ఉంటే జేపీ నడ్డా మాటలను బట్టి చూస్తే పెద్ద ఎత్తున నాయకులు అంతా ఆ పార్టీలో చేరుతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి చేరే వారి జాబితా ఎక్కువగా ఉంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ అయితే ఇంకా సగం పాలన పూర్తి చేసింది. మరో సగం పాలన ఉంది, చేతిలో అధికారం ఉంది. అందువల్ల కాంగ్రెస్ నుంచి నాయకులు పని గట్టుకుని వచ్చి బీజేపీలోకి ఈ సమయంలో చేరుతారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇక బీఆర్ఎస్ లో చూస్తే రేపటి ఎన్నికల్లో తమదే అధికారం అన్నది అయితే ఉంది. రెండు సార్లు గెలిచి ఒకసారి ఓడిన పార్టీ అది. పైగా తెలంగాణా తెచ్చిన కేసీఆర్ లో ఇంకా ఉద్యమ వేడి ఇంకిపోలేదు, మరి ఆ స్థితిలో ఆయన్ని వదిలిపెట్టి బీజేపీలోకి జనాలు పరుగున వచ్చి చేరుతారా అన్నది కీలక ప్రశ్న. ఏది ఏమైనా బీజేపీ డోర్స్ ఎపుడు ఓపెన్ చేస్తారు ఎంత మంది చేరుతారు అన్నదే ఇపుడు ఆసక్తిని పెంచుతున్న విషయంగా ఉంది. చూడాలి మరి తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ మేథమేటిక్స్ ఏమిటో ఏ మ్యాజిక్ ఆ పార్టీ చేస్తుందో అన్నది.