తమిళనాడుకే బీజేపీ ప్రాధాన్యం.. తెరవెనుక స్ట్రాటజీ ఇదే!
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి? అనే విషయంపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది.
By: Tupaki Desk | 6 July 2025 12:00 AM ISTబీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి? అనే విషయంపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. కీలకమైన బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రాలకే ఇవ్వా లని నిర్ణయించారు. కానీ.. దక్షిణాదిలోనే ఏ రాష్ట్రానికి చెందిన నాయకురాలికి ఇవ్వాలన్నది మరో ప్రశ్న. వాస్తవానికి తొలిసారి మహిళకు ఈ పదవిని ఇస్తున్నారన్నది ప్రధాన విషయం అయితే. అదేసమయంలో మోడీ వచ్చిన తర్వాత.. దక్షిణాదికి ఇవ్వడం మరో కీలక అంశం.
ఇప్పటి వరకు ఉన్న లెక్కలు.. రాజకీయ ఈక్వేషన్లను పరిశీలిస్తే.. తమిళనాడుకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వున్నాయి. పైగా.. ఇక్కడ మోడీ ప్రభావం.. ఎక్కువగా కనిపిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ఐదేళ్ల నుంచి కూడా తమిళ నాడుకు ప్రాధాన్యం పెంచారు. ఇక్కడి ప్రజలను కాశీకి తీసుకువెళ్లడంతోపాటు.. ఇక్కడ అభివృద్ది కార్యక్ర మాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
పైగా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు కూడా అధ్యక్ష పీఠాన్ని ఈ రాష్ట్రానికి కేటాయించడమే బెటర్ అన్న బావనవ్యక్తమవుతోంది. ఈ స్టేట్‌లో మహిళల కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని కూడా బీజేపీ ప్రధానంగా పరిశీలన చేస్తోంది. అందుకే.. ఎట్టి పరిస్థితిలోనూ.. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని అనుకున్నా.. అది తమిళనాడుకు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి బీజేపీ ప్రాధాన్యం వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయడమేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.