తప్పుచేసి తిప్పలంటే.. ఇవే కదా కమలనాథా?!
ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణరెడ్డి బీజేపీ టికెట్‌పై విజ యం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 3:28 AMఆయన బీజేపీ నాయకుడు.. పైగా ఎమ్మెల్యే. గతంలో రెండు మూడు పార్టీల మారిన అనుభవం.. రాజకీయా లను తనదైన శైలిలో ఎటైనా మలుచుకునే శైలి ఉన్న నాయకుడు. పైగా ఎదురుదాడి చేయడంలో ఆయ న నిష్ణాతుడు. ఇప్పుడు ఇవన్నీరంగరించి.. కీలక విషయాన్ని తనవైపు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. ఇప్పటికే ఆయన చిక్కుల్లో చిక్కుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చడిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి.
ఏం చేశారు..?
ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణరెడ్డి బీజేపీ టికెట్‌పై విజ యం దక్కించుకున్నారు. ఇక, ఆ వెంటనే ఆదాయ మార్గాలపై పడ్డారన్న రచ్చ ఉండనే ఉంది. మాజీ మిత్రుడు, సొంత రెడ్డి నాయకుడు అయినా.. జేసీ ప్రభాకర్‌రెడ్డితోనే తొడగొట్టారు. కట్ చేస్తే.. అప్పట్లో దాని ని సీఎం చంద్రబాబు సర్దిపుచ్చారు. దీంతో ఇక, లాభం లేదని అనుకున్నారో..ఏమో.. ఏకంగా కంపెనీల పైనే పడిపోయారు. స్థానిక అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీని బెదిరించినట్టు వార్తలు కోకొల్లలుగా వచ్చాయి.
ఇక్కడ సిమెంటుఉత్పత్తి చేసే అల్ట్రాటెక్ కంపెనీ.. ముడి పదార్థాలకు సంబంధించిన కాంట్రాక్టులను స్థానికంగా ఇస్తుంది. వీటిని ఆది నారాయణరెడ్డి అనుచరులు.. బంధువులు కూడా తీసుకున్నారు. ఇక, మరికొందరు వైసీపీ నాయకులు గతంలోనే కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేసి.. అవి తనకే ఇచ్చేయాలన్నది ఆదినారాయణరెడ్డి డిమాండ్. దీనిపై గత వారం రోజులుగా పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది.
తాజాగా.. ఇవి కేంద్రానికి చేరాయి. అల్ట్రాటెక్ కంపెనీకి బీజేపీ పెద్దలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. దీంతో పైవారికి ఫిర్యాదులు అందడంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిని నిలదీశారు. అంతే.. వెంటనే ఆదిvసర్vయూటర్న్ తీసుకుని.. తిప్పలు పడ్డారు. అసలు తాను అల్ట్రాటెక్ జోలికే వెళ్లలేదని.. తనంటే గిట్టనివారే ఇలా ప్రచారం చేశారని చెప్పారు. అంతేకాదు.. తన గురించి వైరల్ అవుతున్న వీడియోలు కూడా మార్ఫింగేనని సెలవిచ్చారు. నిజాలు నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానంటూ.. వాగ్దానాలు చేశారు. మొత్తానికి తప్పుచేసి.. తప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారని.. బీజేపీనాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.