Begin typing your search above and press return to search.

బీజేపీ రాజుగారికి ఆ విష‌యంలో క్లారిటీ కావాలా.. !

కానీ, ప్ర‌భుత్వ ఆలోచ‌న వేరేగా ఉంది. దీనిని ఏదైనా ప్రైవేటు ఇస్తే.. ఖ‌చ్చితంగా సొమ్ములు వ‌స్తాయ‌ని.. త‌ద్వారా.. ప్రైవేటుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు కూడా ఉంటుంద‌ని నాయ‌కులు అంటున్నారు.

By:  Garuda Media   |   7 March 2026 8:45 AM IST
బీజేపీ రాజుగారికి ఆ విష‌యంలో క్లారిటీ కావాలా.. !
X

బీజేపీ సీనియ‌ర్ నేత‌.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు రెండు విష‌యాల‌పై బెంగ ప‌ట్టుకుంది. 1) తాను చెప్పిన‌.. లేదా సూచించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌ని ఆయ‌న అంటున్నా రు. 2) పార్టీలోనూ త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రెండు విష యాల‌పై ఆయ‌న అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. త‌ర‌చుగా మీడియా ముందు కూడా ఇవే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నాదేముంది.. నా మాట ఎవ‌రు వింటారు? అంటూ.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంతకీ.. రాజుగారు చేస్తున్న సూచ‌న‌లు ఏంటంటే.. విశాఖ‌లోని రుషికొండ‌పై వైసీపీ హ‌యాంలో నిర్మించి న ప్యాలెస్‌ను ప్రైవేటుకు ఇవ్వ‌రాద‌ని.. దానిని మ్యూజియంగా మార్చి.. రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు విహార కేంద్రంగా.. ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చాల‌ని చెబుతున్నారు. దీనిని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలోనూ ఇదే వ్యాఖ్య‌లు చేశారు. ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చాల‌ని.. త‌ద్వారా.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు స‌జీవంగా ఉంటాయ‌ని అంటున్నారు.

కానీ, ప్ర‌భుత్వ ఆలోచ‌న వేరేగా ఉంది. దీనిని ఏదైనా ప్రైవేటు ఇస్తే.. ఖ‌చ్చితంగా సొమ్ములు వ‌స్తాయ‌ని.. త‌ద్వారా.. ప్రైవేటుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు కూడా ఉంటుంద‌ని నాయ‌కులు అంటున్నారు. దీనిపై ఏర్పాటైన క‌మిటీ కూడా ఇదే ఆలోచ‌న చేస్తోంది. కానీ, రాజు గారి మాట మాత్రం అలానే ఉంది. ఇక‌, 2వ అంశం.. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గింద‌ని చెప్ప‌డం. ఇది ఎంత‌వ‌ర‌కు వాస్త‌వం అనేది పార్టీ నాయ‌కులు చెప్ప‌డం లేదు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో సోము వీర్రాజే చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు.

పైకి సోము మౌనంగా నే ఉన్నా.. అంత‌ర్గ‌తంగా పార్టీ తీసుకునే నిర్ణ‌యాల్లో ఆయ‌న‌దే పైచేయిగా భావిస్తున్నారు. దీంతో పార్టీలో ఇత‌ర నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌న్న‌ది గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట‌. దీనిని కొంద‌రు స‌ర్దుకు పోతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట‌కు చెబుతున్నారు. బీజేపీ చీఫ్ మాధ‌వ్‌కు సోము గ్రూపులో మ‌నిషిగా పేరుండ‌డం కూడా దీనికి కార‌ణ‌మ‌ని కొంద‌రు అంటున్నారు. దీంతో విష్ణుకుమార్ రాజు వంటి నిఖార్స‌యిన.. మొహ‌మాటం లేకుండా మాట్లాడే నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌న్న‌ది స‌హ‌జం. దీనిని ఆయ‌న ఓర్చుకోలేక పోతున్నారు. ఆయా విష‌యాల‌పై త‌న‌కు స్ప‌ష్ట‌త కావాల‌ని కోరుతున్నారు. ఇది సాధ్య‌మేనా? అనేది చూడాలి.