Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై శృం*గారం.. బీజేపీ నేత బరితెగింపు వీడియో వైరల్!

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మే 13 నాటివని తెలుస్తోంది. మనోహర్ లాల్ ధాకడ్ ఒక మహిళతో తెల్లటి కారులో నుంచి దిగిన తర్వాత అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు.

By:  Tupaki Desk   |   24 May 2025 1:12 PM IST
నడిరోడ్డుపై శృం*గారం.. బీజేపీ నేత బరితెగింపు వీడియో వైరల్!
X

సభ్యసమాజం తలదించుకునే పనికి పాల్పడ్డారో బీజేపీ నాయకుడు! తాను నాయకుడన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. కనీసం మనిషి అనే ఇంగితాన్ని కూడా మరిచి ప్రవర్తించాడు! ఇందులో భాగంగా... ముంబై - ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే పై ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు! ఈ వ్యవహారం హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనిపై బీజేపీ పెద్దలు మౌనం వహించినట్లు తెలుస్తోంది!

అవును... మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ధాకడ్.. ముంబై - ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వేపై ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్న వీడియో వైరల్ మారింది! హైవే పై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై బాన్పూరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మే 13 నాటివని తెలుస్తోంది. మనోహర్ లాల్ ధాకడ్ ఒక మహిళతో తెల్లటి కారులో నుంచి దిగిన తర్వాత అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీనిపై స్పందించిన రత్లాం రేంజ్ డీఐజీ మనోజ్ కుమార్ సింగ్.. అతనిపై భారత శిక్షాస్మృతిలోని 285, 296, 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా.. ధాకడ్ భార్య మందసౌర్ లోని బని గ్రామంలో వార్డ్ నెంబర్ 8 నుంచి బీజేపీ మద్దతుతో ఎన్నికైన జిల్లా పంచాయతీ సభ్యురాలుగా ఉన్నారని తెలుస్తోంది. మరోపక్క ఈ ఘటనపై స్పందించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్... ఇలాంటి పనులు చేసే వ్యక్తులు పార్టీకి అవసరం లేదని అన్నారు.