Begin typing your search above and press return to search.

ఎన్నికల రాష్ట్రాలలోనే మోడీ ఫోకస్... నిజమేనా ?

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడవ సారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ వరసబెట్టి ఎన్నికల్లో గెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 12:15 AM IST
ఎన్నికల రాష్ట్రాలలోనే మోడీ ఫోకస్... నిజమేనా ?
X

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడవ సారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ వరసబెట్టి ఎన్నికల్లో గెలుస్తోంది. అనేక రాష్ట్రాలలో కూడా బీజేపీ పాగా వేస్తోంది. అయితే నాన్ స్టాప్ గా బీజేపీ పవర్ ని అలా అట్టేబెట్టుకోవడానికి కారణం ఏమిటి ఆ గెలుపు సూత్రం ఏమిటి అంటే చాలానే ఉంది.

మరీ ముఖ్యంగా తీసుకుంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో బీజేపీ స్పెషల్ ఫోకస్ పెడుతుంది. వరుసగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా సహా కీలక నేతలు పర్యటిస్తూంటారు. వారి పర్యటనల కంటే ముందు ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ స్టార్ట్ చేస్తుంది అని చెబుతారు.

అలా ఎన్నికల నాటికి బీజేపీ తమ వైపే ఓటర్లు చూసేలా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుంది. మరో వైపు చూస్తే బీజేపీ పెద్దలు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో అధికారిక పర్యటనలు చేసి నిధులు పెద్ద ఎత్తున కుమ్మరిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల అజెండాను జనం ముందు ఉంచి చర్చకు పెడతారు. అలా అనేక రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికలను ఫేస్ చేస్తూ వరసగా గెలుస్తూ వస్తోంది.

ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో 21 రాష్ట్రలకు పైగా బీజేపీ ఎన్డీయే నాయకత్వం చేతిలో ఉన్నాయంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య వరసబెట్టి ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో పర్యటించారు. అక్కడ ఆయన పహిల్గాం ఉగ్ర దాడుల గురించి తన ప్రసంగాలలో చెబుతూ ఆపరేషన్ సిందూర్ తో భారత్ ఎలా తిప్పికొట్టిందో వివరించారు

అంతే కాదు పాక్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా మోడీ ఒక వ్యూహం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న రాష్ట్రాలలో ముందస్తు పర్యటనలు చేస్తున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీ గుజరాత్ లో రెండు రోజుల పర్యటన చేసి అక్కడ పాక్ మీద తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆపరేషన్ సిందూర్ అన్నది ఆగేది కాదని నిరంతరం కొనసాగుతుందని కూడా సంచలన ప్రకటన చేశారు.

అదే విధంగా బీహార్ లో సైతం మోడీ పర్యటించారు. అక్కడ కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ మీదట యూపీలో కూడా మోడీ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా మోడీ పర్యటన చేశారు. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. మమతను నిర్మమత అని కూడా ఆయన సెటైర్లు వేశరు.

ఇక చూస్తే కనుక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఇలా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలోనే మోడీ పర్యటిస్తున్నారని అక్కడే నిధులు ఎక్కువగా ఇస్తున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మణిపూర్ గత ఏడాదిన్నరగా మండిపోతూంటే ప్రధాని అక్కడికి ఎందుకు వెళ్ళలేదని నిలదీస్తున్నాయి. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ లో పహిల్గాంలో ఉగ్ర దాడి జరిగి 26 మంది అమాయకులు చనిపోతే ప్రధాని ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ గురించి చెబుతూ ప్రధాని మోడీ ఎన్నికల రాష్ట్రాలలో ప్రసంగాలు చేయడం ద్వారా భావోద్వేగాలను అనుకూలం చేసుకుంటున్నారు అని ఫైర్ అవుతున్నాయి.

దీని మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే సైనికులకే ఆపరేషన్ సిందూర్ క్రెడిట్ దక్కుతుందని అటువంటిది దానికి పదే పదే మోడీ ఎందుకు చెప్పుకోవడమని ప్రశ్నించారు. అంతే కాదు దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే కేంద్ర బీజేపీ పెద్దలు అక్కడ పర్యటించడం రాజకీయమే అంటున్నారు. మరి మోడీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. ఆయ్హన పహిల్గాం ప్రాంతాన్ని సందర్శిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికలు ఉంటేనే మోడీ పర్యటనకు చేస్తారు ఆ రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తారు అన్న విపక్షాల విమర్శలకు బీజేపీ నుంచి ఏ రకమైన జవాబు వస్తుందో చూడాల్సి ఉంది.