Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్...బీజేపీకి లక్కీ నంబర్ అదేనా ?

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్ సభ సీట్ల పునర్ విభజన బిల్లుని నెగ్గించుకోవాలని చూస్తోంది.

By:  Satya P   |   16 April 2026 5:34 PM IST
డీలిమిటేషన్...బీజేపీకి లక్కీ నంబర్ అదేనా ?
X

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్ సభ సీట్ల పునర్ విభజన బిల్లుని నెగ్గించుకోవాలని చూస్తోంది. అయితే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందాలీ అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. లోక్ సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో నుంచి రెండు వంతులు అంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. రాజ్యాంగ సవరణ బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం పొందవు. అవి నెగ్గాలీ అధిక సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి ఇపుడు ఆ సంఖ్యా బలం ఎలా దక్కుతుంది అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.

విపక్షాలు కట్టుగా :

ఇదిలా ఉంటే విపక్షాలు కట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలు అన్నీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2027 లో పూర్తి అయ్యే జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెంచాలని కోరుతున్నారు. పైగా దేశంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగరాదని వాదిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాదికి చిన్న రాష్ట్రాలకు ఎంతో అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నాయి. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అని కూడా విమర్శిస్తున్నాయి. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలు ఏవైనా అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం ఉండాలని కూడా కోరుతున్నాయి. దాంతో ఇండియా కూటమి పార్టీలు బిల్లు ఇపుడు వద్దే వద్దు అని పట్టు బడుతున్నాయి.

తేడా స్వల్పమే :

ఇక 543 స్థానాలున్న లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న ఎంపీల బలం 293 మంది మాత్రమే. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 240 స్థానాలుంటే మిగిలిన 53 ఎంపీలు మిత్రుల పార్టీలకు చెందినవి ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీలు ఉంటే మిగిలిన పార్టీలతో కలిపి మొత్తం 234 ఎంపీల బలం ఉంది. ఈ రెండు పార్టీలు కాకుండా 26 మంది తటస్థ పార్టీల ఎంపీలు ఉన్నారు. అందులో వైసీపీకి నలుగురు ఉంటే ఏఐఎంఐఎం కి ఒక సీటు ఉంది. అదే విధంగా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), రాజస్థాన్‌కు చెందిన భారత్ ఆదివాసి పార్టీ, మిజోరంకి చెందిన జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ, మేఘాలయ నుంచి వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ ఉంటే ఇండిపెండెంట్ ఎంపీలుగా రాజేష్ రంజన్ (పప్పు యాదవ్), అమృతపాల్ సింగ్ అబ్దుల్ రషీద్ షేక్ వంటి వారు ఉన్నారు. వీరందరి బలం కూడా ఎన్డీఏ వైపు తిప్పుకున్నా ఇంకా 31 మంది ఎంపీల బలం ఎన్డీయేకు కావాల్సి ఉంది. వారు కచ్చితంగా ఇండియా కూటమి నుంచే రావాల్సి ఉంది.

అది సాధ్యమేనా :

ఇండియా కూటమి అయితే బలంగా ఉంది ఎన్డీయేకు యాంటీగా స్ట్రాంగ్ గా నిలబడే పార్టీల అందులో ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కలసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన సమావేశంలో పాల్గొని మరీ తాము కేవలం మహిళా బిల్లుకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతునాయి. దాంతో ఈ పార్టీల నుంచి ఎంపీలను ఎలా ఆకట్టుకోవాలి అన్న దాని మీదనే డీలిమిటేషన్ బిల్లు విజయం ఆధారపడి ఉంది అని అంటున్నారు. అదే విధంగా తటస్థ పార్టీలు అన్నీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చేది కూడా ఉండబోదు అని అంటున్నారు.

గైర్ హాజరు అయినా :

అయితే ఇక్కడ మరో ఆప్షన్ ఉంది. బిల్లుని వ్యతిరేకించనక్కరలేదు, అలా అని అనుకూలం చేయాల్సింది లేదు, సభకు ఓటింగ్ సమయంలో గైర్ హాజైతే చాలు. అలా ఎంపీలను ఒప్పించినా బిల్లుకు అవసరమిన సంఖ్యాబలం ఎన్ డీఎయేకు లభిస్తుంది. ప్రస్తుతం ఎన్డీయే వ్యూహకర్తలు డీలిమిటేషన్ బిల్లుని లోక్ సభలో నెగ్గించడం కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు అని అంటున్నారు. ఏమి జరుగుతుంది డీలిమిటేషన్ భవితవ్యం ఏమిటి అన్నది శుక్రవారం సాయంత్రం జరిగే ఓటింగ్ తో తేలిపోతుంది అని అంటున్నారు. చూడాలి మరి.