Begin typing your search above and press return to search.

టీడీపీ నీడ కింద బ‌తికేస్తున్న బీజేపీ.. !

బిజెపి సీట్ల విషయానికి వస్తే ప్రస్తుతం పార్లమెంటుకు ముగ్గురు నాయ‌కులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

By:  Garuda Media   |   28 March 2026 10:00 PM IST
టీడీపీ నీడ కింద బ‌తికేస్తున్న బీజేపీ.. !
X

బిజెపి సీట్ల విషయానికి వస్తే ప్రస్తుతం పార్లమెంటుకు ముగ్గురు నాయ‌కులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు .అయితే భవిష్యత్తు ఏంటి వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయి అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న పరిస్థితిలో బిజెపి నాయకులు ఏ మేరకు పుంజుకోవాలి.. నాయకత్వం ఏ విధంగా ముందుకు సాగాలి.. అనే అంశాలు కీలకంగా మారాయి. ఈ రకంగా చూసుకున్నప్పుడు ప్రస్తుతం బిజెపి పరిస్థితి పైస్థాయిలో మాత్రమే నాయకులు కనిపిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో జెండా మోసే వాళ్ళు గాని జెండా పట్టుకునే వాళ్ళు గాని కేవలం విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం వంటి కొన్ని నగరాలకు మాత్రమే బిజెపి పరిమితమైంది. ఈ విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. అయినా పుంజుకునే దిశగా ఎటువంటి అడుగులు పడడం లేదు. అయితే ప్రధానంగా కూటమిలో ఉన్నారు కాబట్టి.. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే నిజంగానే పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలన్న ఆలోచన ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కార్యాచరణ లేదన్న కారణంగా వెనక పెట్టారా అనేది చూడాలి.

కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైన బిజెపి వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని సీట్లు కావాలని పట్టు పడుతోంది. అంతేకాదు ఈసారి 30 నుంచి 40 స్థానాలు కావాలని కూడా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే అసలు అన్ని సీట్లు ఇచ్చిన బిజెపి తరఫున పోటీ చేసేందుకు నాయకులు లేరన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని మరిచిపోయి సీట్ల కోసం పట్టుబడుతున్నారే తప్ప పార్టీని డెవలప్ చేయటం కానీ పార్టీ తరఫున బలమైన నాయకత్వాన్ని ఎంచుకోవడంలో కానీ నాయకులు దృష్టి పెట్టడం లేదు.

ఇక రాష్ట్రంలో బిజెపి ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒకటి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మద్దతు పలికే వర్గం. రెండు కేంద్రానికి మద్దతు పలికే వర్గం. మూడు తటస్థంగా ఉంటున్న వర్గం. ఇలా మూడు వర్గాలుగా బిజెపిలో నాయకులు కూటములు కట్టారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా పార్టీని డెవలప్ చేయాలన్న పరిస్థితి నుంచి వర్గ పోరుదిశగా బిజెపి అడుగులు వేస్తోంది అన్నది వాస్తవం.

కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం తమకు భారీ సంఖ్యలో సీట్ల కేటాయింపు కావాలని కోరుతుంది. మరి ఇదేమి లాజిక్కు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. గత ఎన్నికల్లో బిజెపికి ఇచ్చిన స్థానాల్లో కేవలం టిడిపి మద్దతు కారణంగానే విజయం సాధించారన్నది వాస్తవం. కాబట్టి ఇదే పంథాను ఎంచుకుంటారా లేకపోతే పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.