Begin typing your search above and press return to search.

దేశంలో 2047 దాకా బీజేపీనే...విపక్షాల మాటేంటి ?

బీజేపీకి ఒక ఆశయం ఉంది. ఆరాటం ఉంది. లక్ష్యం ఉంది. ఉద్దేశ్యం కూడా ఉంది. అదేంటి అంటే 2047 దాకా అధికారంలో తామే ఉండాలని.

By:  Satya P   |   21 May 2026 10:30 PM IST
దేశంలో 2047 దాకా బీజేపీనే...విపక్షాల మాటేంటి ?
X

బీజేపీకి ఒక ఆశయం ఉంది. ఆరాటం ఉంది. లక్ష్యం ఉంది. ఉద్దేశ్యం కూడా ఉంది. అదేంటి అంటే 2047 దాకా అధికారంలో తామే ఉండాలని. అందుకే వికసిత భారతం 2047 అన్న నినాదాన్ని బీజేపీ అందుకుంది. నిజానికి బీజేపీ ఆలోచనలు లక్ష్యాల విషయంలో ఏ తప్పూ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో కలకాలం కొనసాగాలని అనుకుంటుంది. అందుకు బీజేపీ అతీతం కాదు. ఇక 2047 అంటే ఒక హిస్టారికల్ మూవ్ మెంట్ అన్నది చూడాల్సి ఉంది. అప్పటికి ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు అవుతుంది. అంటే దేశ శతాబ్ది ఉత్సవాల నాటికి ఎర్ర కోట మీద జెండా ఎగరేయాలని చరిత్రలో తమ ప్లేస్ పదిలంగా ఉంచుకోవాలన్న అతి పెద్ద టార్గెట్ బీజేపీకి ఉంది అని అంటున్నారు. 1947 స్వాతంత్ర్యం వచ్చిన వేళకు కాంగ్రెస్ చేతిలో పగ్గాలు ఉన్నాయి. అలా బీజేపీ కూడా తమ చేతిలో పగ్గాలు ఉంచుకుని దేశం గర్వించే వందేళ్ళ పండుగను చేయాలని చూస్తున్నారు అని అంటారు.

ట్రాక్ రికార్డు చూస్తే :

ఇక దేశంలో చూస్తే 1947 నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని మూడున్నర దశాబ్దాల తరువాత జనాలు దింపేశారు. అంటే కాంగ్రెస్ కి అన్నేళ్ళు చాన్స్ ఇచ్చారు అన్న మాట. అదే సమయంలో ఆ స్థాయికి చేరుకున్న పార్టీ తన రాజకీయ అవకాశాలు పొలిటికల్ అడ్వాంటేజెస్ ని వాడుకుంటూ ప్రతీ ఎన్నికల్లోనూ గెలవాలని చూస్తుంది. అలా కాంగ్రెసేతర పార్టీ బలంగా ఆల్టర్నేషన్ గా ఆవిర్భవించడానికి కూడా అంత సమయం పట్టిందని అనుకోవాలి. ఇపుడు బీజేపీకి బలమైన ఆల్టర్నేషన్ బీజేపీయేతర పార్టీల వేదిక ఏర్పాడాలి అంటే అంత సమయమూ పడుతుంది అన్నది పొలిటికల్ పండిట్స్ చెబుతున్న మాట. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరసగా మూడుసార్లు గెలిచింది అంటే దాని వెనక ఆ పార్టీ గొప్పదనంతో పాటు విపక్షాల వీక్ నెస్ కూడా ఉందని అని విశ్లేషణలు ఉన్నాయి.

బీజేపీకి తిరుగు లేదు :

ఇదిలా ఉంటే యాక్సిస్ మై ఇండియా బీజేపీ మరింత కాలం అధికారంలో ఉంటుందని తనదైన విశ్లేషణ చేసింది. ఒక రాజకీయ తరంగా బీజేపీ రెండు దశాబ్దాల పాటు కొనసాగుతుంది అని యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. పాలన బాగున్నంత కాలం బీజేపీ అధికారంలోనే ఉంటుందని ఆయన తేల్చేశారు. ఆయన దానికి దేశంలో ఉన్న పొలిటికల్ ట్రాక్ రికార్డుని కూడా ఉదహరించారు. 1977 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా అని గుర్తు చేశారు. ఇదొక పొలిటికల్ సైకిల్ గా ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల దేశంలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం ఇంకో ఇరవై ఏళ్ళ పాటు ఉంటుందని ఆయన వివరించారు. అదే సమయంలో ఆయన మరో మాట అన్నారు. కేంద్రంలో ఎన్డీయే మీద అంచనాలు బాగా పెరిగిపోతున్నాయని అందువల్ల రానున్న రోజులలో బీజేపీ ఇంకా ఎక్కువగా రాణించాలని కూడా సూచించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పొలిటికల్ సినారియో :

ఇక దేశంలో చూస్తే పొలిటికల్ సినారియో కూడా అదే చెబుతోంది అని అంటున్నారు. ముప్పాతిక కి పైగా దేశాన్ని బీజేపీ పాలిస్తోంది. ఒకనాడు కాంగ్రెస్ కి ఉన్న రాజకీయ ఆధిపత్యం ఈ రోజు బీజేపీ సొంతం. కాంగ్రేసేతర పార్టీలు అన్నీ కలసి ఆ పార్టీని దించడం అన్నది అప్పట్లో ఒక పెద్ద రాజకీయ యాగంగా సాగింది. ఇపుడు చూస్తే అలాంటి ప్రయత్నాలు ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాయి. ఇవి పక్వానికి వచ్చి ఫలప్రదమై పండేందుకు కనీసంగా మరో రెండు మూడు ఎన్నికల దాకా పడుతుందని అంటున్నారు. అంటే ఈ లెక్కన 2029, 2034, 2039, 2044 ఎన్నికల వరకూ బీజేపీ పొలిటికల్ డామినేషన్ కొనసాగే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి లేదు అన్న మాట అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.