ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్ గురించి తెలుసా?
అవును... ఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా బ్లూటూత్ నెట్ వర్క్ లపై పనిచేసేలా "బిట్ చాట్" అనే యాప్ రూపొందించబడింది.
By: Tupaki Desk | 9 July 2025 6:00 AM ISTమెసేజింగ్ యాప్ అంటే ఎక్కువగా ఠక్కున గుర్తుకొచ్చేది వాట్సప్ అనే సంగతి తెలిసిందే. అయితే ఆ వాట్సప్ కు పోటీగా పీర్-టు-పీర్ మెసేజింగ్ యాప్ అయిన "బిట్ చాట్" బీటా వెర్షన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సే. దీనికున్న స్పెషాలిటీ ఏమిటంటే... ఈ యాప్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది.
అవును... ఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా బ్లూటూత్ నెట్ వర్క్ లపై పనిచేసేలా "బిట్ చాట్" అనే యాప్ రూపొందించబడింది. ఇదే సమయంలో దీనికి ఇంటర్నెట్ తో పాటు సెంట్రల్ సర్వర్లు, ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ లు అవసరం లేదు. అయితే ఈ యాప్ ప్రారంభం డామస్, బ్లూస్కీ వంటి ప్లాట్ ఫారమ్ లకు డోర్సే గతంలో ఇచ్చిన మద్దతుపై ఆధారపడి ఉందని అంటున్నారు.
2019 హాంకాంగ్ నిరసనల సమయంలో ఉపయోగించిన బ్లూటూత్ ఆధారిత యాప్ ల మాదిరిగానే, ఇంటర్నెట్ యాక్సెస్ నిరోధించబడినప్పుడు కూడా బిట్ చాట్ పనిచేసేలా రూపొందించబడిందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ యాప్ గ్రూప్ చాట్ లు లేదా చాట్ రూమ్ లకు సపోర్ట్ చేస్తుందని.. వీటిని హ్యాష్ ట్యాగ్ లతో పేరు పెట్టవచ్చని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఈ యాప్ స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఫీచర్ ను కలిగి ఉంది. భవిష్యత్తులో వచ్చే అప్ డేట్ వేగం, లిమిట్ ని మరింత పెంచడానికి వైఫై డైరెక్ట్ ని జోడించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా... ఈ బిట్ చాట్ ఎటువంటి అకౌంట్స్, పర్సనల్ ఐడెంటి ఫైయర్ లు, డేటా సేకరణ లేకుండా పూర్తిగా పీర్-టు-పీర్ గా పనిచేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
