Begin typing your search above and press return to search.

ఆసియా బిలియనీర్స్ రాజధానిగా ముంబై... లెక్కలివే!

ఆసియా బిలియనీర్ రాజధానిగా ముంబై ఆవిర్భవించింది.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో టాప్ ప్లేస్ ను ఆక్రమించారు

By:  Tupaki Desk   |   26 March 2024 1:30 PM GMT
ఆసియా బిలియనీర్స్ రాజధానిగా ముంబై... లెక్కలివే!
X

ఆసియా బిలియనీర్ రాజధానిగా ముంబై ఆవిర్భవించింది.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో టాప్ ప్లేస్ ను ఆక్రమించారు. తాజాగా 271 మంది బిలియనీర్లతో అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో... నగరాల విషయంలో మాత్రం ఆసియాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. దీంతో... ఇప్పుడు ఆసియా బిలియనీర్స్ రాజధానిగా ముంబై సరికొత్త హోదా సంపాదించుకుంది.

అవును.. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం... ప్రపంచంలో 3,279 మంది బిలియనీర్లు ఉండగ.. వీరిలో చైనాలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు (814), యునైటెడ్ స్టేట్స్ (800) వరుసగా ఉండగా... తర్వాతి స్థానంలో ఇండియా ఉంది. అయితే... గత ఏడాదితో పోలిస్తే... అమెరికా, భారత్‌ లు వరుసగా 109, 84 మంది బిలియనీర్లను కొత్తగా చేర్చుకోగా.. ఈ విషయంలో చైనా సంఖ్య 155 తగ్గింది.

ప్రస్తుతం ఆసియాలో బీజింగ్ సిటీలో 91 మంది బిలియనీర్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ముంబైలో బిలియనీర్ల సంఖ్య 92కు చేరింది. దీంతో ఆసియాలో నెంబర్ 1, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 3 స్థానాలకు ముంబై చేరింది. ఈ విషయంలో న్యూయార్క్ సిటీలో అత్యధికంగా 119 మంది బిలియనీర్లు ఉండగా.. లండన్ లో 97 మంది ఉన్నారు.

ఇక తాజా డేటాలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ కూడా మొట్టమొదటిసారిగా టాప్ 10 బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో... బిలియనీర్ల సంఖ్య పరంగా టాప్ 10 దేశాల జాబితా, టాప్ 10 నగరాల జాబితా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం...!

బిలియనీర్ల సంఖ్య పరంగా టాప్ 10 దేశాలు:

చైనా

అమెరికా

భారత్

యూకే

జర్మనీ

స్విట్జర్లాండ్

రష్యా

ఇటలీ

ఫ్రాన్స్

బ్రెజిల్

బిలియనీర్ల సంఖ్య పరంగా టాప్ 10 నగరాలు:

న్యూయార్క్ (యూఎస్)

లండన్ (యూకే)

ముంబై (భారత్)

బీజింగ్ (చైనా)

షాంఘై (చైనా)

షెన్‌ జెన్ (చైనా)

హాంకాంగ్ (చైనా)

మాస్కో (రష్యా)

న్యూఢిల్లీ (భారత్)

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్)