Begin typing your search above and press return to search.

పౌలా హర్డ్‌ తో బిల్ గేట్స్... మరోసారి వైరల్ ఇష్యూ!

ఈ సందర్భంగా బిల్ గేట్స్, పౌలా హర్డ్ ఇతర స్నేహితుల తో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారాయి.

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:47 AM GMT
పౌలా హర్డ్‌  తో బిల్  గేట్స్... మరోసారి వైరల్  ఇష్యూ!
X

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ - ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ సతీమణి పాలా హర్డ్‌ మధ్య ఏదో సంబంధం ఉందని, వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారని గతకొంతకాలంగా రూమర్స్ హల్ చల్ చెస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందుకు తాజాగా మరో రూమర్ జోడవుతూ... ఆ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

అవును... మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్‌ శాంచెజ్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఎంగేజ్మెంట్‌ ఘనంగా జరిగింది. ఇటలీ లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్‌ కు బిల్ గేట్స్ (67), ఆయన ప్రియురాలు అని అంటున్న పౌలా హర్డ్‌ (61) లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్‌ సిక్స్‌ నివేదించింది.

ప్రస్తుతం.. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలువైన షిప్ ఇటలీ లో ఉంది. ఈ నౌకలో బెజోస్‌ ఎంగేజ్మెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్, పౌలా హర్డ్ ఇతర స్నేహితుల తో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారాయి.

ఆ ఫోటోలే బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్‌ లో ఉన్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ పలు నివేదికలు వెలుగు లోకి వచ్చాయి. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ ను వీక్షిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఇదే విషయం పై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా మాట దాట వేస్తూ వచ్చారు.

పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం... యుఎస్‌ లోని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడితో కలిసి హర్డ్ తన ఉంగరపు వేలికి రింగ్ ధరించి ఉందని, అందుకు సంబంధించిన ఫోటో తీయబడిందని కథనాలొచ్చాయి. దీంతో వారి నిశ్చితార్థం గురించి పుకార్లు వచ్చాయి.

కాగా... .2021లో బిల్‌ గేట్స్‌.. మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం వాషింగ్ట‌న్‌ లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు స‌మ‌యం లో ఇద్దరూ క‌లుసుకున్నారు.

ఈ క్రమంలో 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ ఆధారంగా డైవ‌ర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్‌ నుంచి విడిపోయిన బిల్‌ గేట్స్‌.. ప్రస్తుతం పౌలా హార్డ్‌ తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారని తెలుస్తోంది.