Begin typing your search above and press return to search.

బీహార్ లో బీజేపీ ఓడితే మోడీ సర్కార్ కూలుతుందా ?

ఈ నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి చాలానే ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2025 11:06 PM IST
బీహార్ లో బీజేపీ ఓడితే మోడీ సర్కార్ కూలుతుందా ?
X

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికి మూడు దఫాలుగా అధికారంలో ఉంటూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సొంతంగా మెజారిటీ అయితే రాలేదు. బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఏపీ నుంచి తెలుగుదేశం బీహార్ లో ఉన్న జేడీయూ మద్దతు అనే రెండు ఊతకర్రలతో ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్తు బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఉందా అన్న చర్చ సాగుతోంది.

గ్రాఫ్ తగ్గుతున్న వేళ :

ఇక చూస్తే బీజేపీకి గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది అని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఆపరేషన్ సింధూర్ విషయంలో వ్యవహరించిన తీరు ట్రంప్ పదే పదే భారత్ ని తానే యుద్ధం ఆపించాను అని చెప్పడం దానికి ధీటుగా బదులు ఇవ్వలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మీద జనంలో అయితే సందేహాలు అలాగే ఉన్నాయి. ఒక ఈ మధ్యలో ఓట్ల చోరీ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అతి పెద్ద ప్రచారం స్టార్ట్ చేశారు. ఆయన జనంలోకి వెళ్ళి ఈసీ మీద బీజేపీ మీద బలమైన ఆరోపణలు చేస్తున్నారు. అవి బాగానే చర్చకు వస్తున్నాయి. ఇక బీహార్ లో చూస్తే రాహుల్ ఓటు అధికార్ యాత్ర పేరుతో చేస్తున్న పర్యటనలకు మంచి స్పందన లభిస్తోంది అని అంటున్నారు.

బీహార్ లో ఎదురు గాలి వీస్తే :

ఈ నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి చాలానే ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భవితవ్యం బీహార్ ఓటర్లు ఇచ్చే తీర్పు మీదనే ఉంది అని వారు అంటున్నారు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు అల్కా లాంబా అయితే కాస్తా ముందుకు వెళ్ళి బీహార్ నుంచి బీజేపీని తరిమి కొట్టండి దేశంలోనే ఆ పార్టీ గద్దె దిగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి విచ్చిన్నం అవుతుందని ఆ విధంగా మోడీ గద్దె దిగుతారు అని కూడా ఆమె గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు.

బాబు నితీష్ ఇద్దరూ :

అదెలా సాధ్యమో ఆమె చెబుతున్నారు. బీహార్ లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూలితే జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ఎన్డీయే నుంచి బయటకు వస్తారని ఆమె జోస్యం చెబుతున్నారు. అంతే కాదు ఏపీ నుంచి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తుందని ఆమె గట్టిగానే చెబుతున్నారు. ఈ రెండు పార్టీల మద్దతు పోతే కనుక ఎన్డీయే సర్కార్ కేంద్రంలో కూలుతుందని ఆ విధంగా ప్రజలకు బీజేపీ ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు.

ఇది సాధ్యమేనా :

ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జేడీయూ ఎన్డీయే ప్రభుత్వం తో తెగదెంపులు చేసుకుంటారా అన్నది కూడా చర్చకు వస్తోంది. అసలు ఇది జరిగే పనేనా అని కూడా అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అంటున్నారు ఈ మధ్యనే జగన్ రాహుల్ గాంధీ బాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని ఆరోపించారు. ఆ విషయం కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కానీ ఇపుడు కాంగ్రెస్ మహిళా నాయకురాలు అల్కా లాంబా దీని మీద చేస్తున్న ప్రకటనలు చెబుతున్న జోస్యాలు దేశంలో అతి పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. మొత్తం మీద చూస్తే బీహార్ కి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏదో బంధం ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ లెక్క తేలాలీ అంటే నవంబర్ వరకూ వేచి చూడాల్సిందే.