Begin typing your search above and press return to search.

సీఎం అవుతానన్న జగ్గారెడ్డి ఓటమి... కాంగ్రెస్ కి బిగ్ షాక్...

ఒక వైపు కాంగ్రెస్ ప్రభంజనం వీస్తూ ఉంటే ఆయన మాత్రం తాను గెలుస్తూ వచ్చిన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం మాత్రం కాంగ్రెస్ కి బిగ్ షాక్ అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Dec 2023 11:06 AM GMT
సీఎం అవుతానన్న జగ్గారెడ్డి ఓటమి... కాంగ్రెస్ కి బిగ్ షాక్...
X

నేను ఒక పదేళ్లలో ఎపుడైనా సీఎం అవుతాను అని జగ్గారెడ్డి అంటూ వచ్చారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. ఆయన ప్రతీ దానికీ మీడియా ముందుకు వచ్చి హల్ చల్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ లో తానే పెద్ద లీడర్ అని కూడా అంటూంటారు.

అలాంటి నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఓటమి పాలు అయ్యారు. ఒక వైపు కాంగ్రెస్ ప్రభంజనం వీస్తూ ఉంటే ఆయన మాత్రం తాను గెలుస్తూ వచ్చిన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం మాత్రం కాంగ్రెస్ కి బిగ్ షాక్ అని అంటున్నారు.

ఇక చూస్తే జగ్గారెడ్డి బీయారెస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. దీంతో జగ్గారెడ్డి సీఎం ఆశలు కాదు కానీ ఎమ్మెల్యే ఆశలే లేకుండా పోయాయని అంటున్నారు. నిజానికి ఈ దఫా జగ్గారెడ్డి గెలిస్తే ఆయన కచ్చితంగా మంత్రి అయి ఉండేవారు అని అంటున్నారు.

అంతే కాదు తన హవా అలా చాటుకుంటూ మరోసారికి అయినా సీఎం రేసులో ఉంటారని కూడా అంతా భావిస్తూ వచ్చారు. ఉన్నది ఉన్నట్లుగా బోల్డ్ గా మాట్లాడే జగ్గారెడ్డి అంటే జనాలకు ఒక రకమైన అభిమానం అని కూడా చెబుతారు. మరి ఇంత మంచి వేవ్ ఉన్న టైం లో జగ్గారెడ్డి ఎందుకు ఓడారు అన్నది చూడాల్సిందే అంటున్నారు. ఏది ఏమైనా మాజీ అయిన జగ్గారెడ్డి కాంగ్రెస్ గెలుపులో కాంగ్రెస్ పవర్ లో తాను భాగం కాలేకపోవడం మాత్రం బాధగా ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.