Begin typing your search above and press return to search.

బిగ్ ఫైట్ కు ముహూర్తం రెడీనా ?

పైగా మొన్ననే ఇండియా కూటమి తరపున 20 మంది ఎంపీలు రెండురోజుల పాటు మణిపూర్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల ను పరిశీలించి, బాధితులతో మాట్లాడి ఒక రిపోర్టును రెడీచేసింది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:11 AM GMT
బిగ్ ఫైట్ కు ముహూర్తం రెడీనా ?
X

పార్లమెంటు లో బిగ్ ఫైట్ కు ముహూర్తం నిర్ణయమైంది. ఈనెల 8,9,10 తేదీల్లో మూడురోజుల పాటు పార్లమెంటు లో మణిపూర్ ఘటనల పై చర్చకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తేదీల ను ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన దగ్గర నుండి మణిపూర్లో అల్లర్ల పై ఉభయసభల్లో చర్చ జరగాల్సిందే అని ఇండియా కూటమి, ప్రతిపక్షాలు పదేపదే సభల్లో నానా రచ్చ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎంత గోలచేస్తుంటే అధికారపక్షం అంతగా భీష్మించుకుని కూర్చున్నది.

ఎట్టిపరిస్ధితుల్లోను మణిపూర్ పై పార్లమెంటులో చర్చలు జరిగేందుకు లేదని తాము అనుమతించిన పద్దతిలో మాత్రమే చర్చలు జరగాల ని ఎన్డీయే గట్టిగా చెబుతోంది. ఇక్కడే పాలక-ప్రతిపక్షాల మధ్య వివాదం పెరిగిపోయి ప్రతిరోజు గొడవలవుతున్నాయి.

పైగా మొన్ననే ఇండియా కూటమి తరపున 20 మంది ఎంపీలు రెండురోజుల పాటు మణిపూర్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల ను పరిశీలించి, బాధితులతో మాట్లాడి ఒక రిపోర్టును రెడీచేసింది. దాని ఆధారంగా పార్లమెంటులో మాట్లాడేందుకు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు గట్టిగా పట్టుబట్టారు.

ఎన్డీయే ఎట్టి పరిస్ధితుల్లోను చర్చకు అనుమతించదని తెలిసే అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ ఇన్నిరోజుల కు తేదీల ను ప్రకటించారు. 8,9,10 తేదీల్లో పార్లమెంటు లో మంటలు మండటం ఖాయమనే అర్ధమవుతోంది.

ఎందుకంటే మణిపూర్లో అల్లర్లకు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల వైఫల్యమే ఎక్కువగా కనబడుతోంది. తమ వైఫల్యాల ను కప్పిపుచ్చేందుకు, వాస్తవాలు ప్రపంచానికి తెలియకుండా ఉండటానికే నరేంద్రమోడీ ప్రభుత్వం మణిపూర్ పై చర్చల ను సభల్లో అనుమతించటంలేదు.

మొత్తానికి ఇపుడు మూడురోజులు కేటాయించారు కాబట్టి ముందుగా ప్రతిపక్షాల నేతలంతా మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడేటపుడు కచ్చితంగా మోడీని ఎండగట్టేయటం ఖాయం. దాన్ని అధికార కూటమి పార్టీలు తిప్పికొట్టడమూ ఖాయమే. ఈ పద్దతిలో మూడురోజులు సభ అట్టుడికిపోతుంది.

అందరు మాట్లాడేసిన తర్వాత చివర కు మోడీ సమాధానమిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో ఏదో అయిపోతుందని కాదు కానీ మోడీ ప్రభుత్వాన్ని ప్రజలముందు దోషిగా నిలబెట్టడమే ప్రతిపక్షాల ప్రయత్నం. అందుకనే పార్లమెంటు లో బిగ్ ఫైట్ కు ముహూర్తం రెడీ అయినట్లుందని అనుకుంటున్నది.