Begin typing your search above and press return to search.

రేవ్‌ పార్టీలో మత్తుకోసం పాము విషం.. సప్లై చేసిన బిగ్‌ బాస్‌ విన్నర్!

ఇప్పటి వరకు సాదారణంగా రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం, వ్యభిచారం నిర్వహించడం వంటివి వినిపించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Nov 2023 12:30 PM GMT
రేవ్‌  పార్టీలో మత్తుకోసం పాము విషం.. సప్లై చేసిన బిగ్‌  బాస్‌  విన్నర్!
X

ఇప్పటి వరకు సాదారణంగా రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం, వ్యభిచారం నిర్వహించడం వంటివి వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిటీ అవుట్ కట్స్ లో, ఫాం హౌస్ లలో ఇవి జరుగుతూ ఉండేవి. వీటిపై పోలీసులు దాడులు చేయడం, నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం, పార్టీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ కల్చర్‌ మరింత వెర్రి తెలలు వేస్తూ, ఇంకా ప్రమాదకరంగా మారిందని తెలుస్తుంది. తాజాగా జరిగిన ఓ రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారు.

అవును.. నినడానికి నమ్మశక్యంగా లేకపోయినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతో.. దాడిచేసి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఇదే సమయంలో ఇక్కడ మత్తు కోసం పాము విషాన్ని వాడారని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారని అంటున్నారు. మరొక ఆస్కతికరమైన విషయం ఏమిటంటే... అది సరఫరా చేసింది బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ అని తేలిందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... నోయిడాలోని సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌ లో తాజాగా ఓ రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడిచేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా రేవ్ పార్టీలో పాము విషాన్ని ప్రయోగించినందుకు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు విస్తృతంగా వెతుకుతున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ ఎల్విష్ యాదవ్ కోసం మూడు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో ఎల్విష్ యాదవ్ తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుంటూ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. ఇందులో... తన పేరును కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. మరోపక్క ఈ కేసులో నోయిడా పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు.

ఈ విషయాలపై స్పందించిన పోలీసులు రేవ్‌ పార్టీలో 9 పాములు, 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని అక్కడ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జంతు హక్కుల సంఘం పీపుల్ ఫర్ యానిమల్స్.. సెక్టార్ 51లోని ఒక బాంకెట్ హాల్‌ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో పార్టీ కోసం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుండి ఐదు నాగుపాములు, రెండు తలల పాములు, ఒక రెడ్ స్నేక్, కొండచిలువ సహా తొమ్మిది సర్పాలు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో 20-25 మిల్లీ లీటర్ల పాము విషాన్ని పార్టీలో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిపై ఐపీసీ సెక్షన్ 120బీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 9, 39, 49, 50, 51 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

కాగా.. ఇప్పటి వరకు అందరికీ బిగ్ బాస్ విన్నర్ గా ఎల్విష్ యాదవ్‌ పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం రేవ్ పార్టీ ఆర్గనైజర్, డ్రగ్స్ డీలర్, పాము విషం సరఫరా చేసే వ్యక్తిగా గుర్తింపు పొందాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే... అతను మాత్రం "ఈ కేసులో తన ప్రమేయం 0.1 శాతం ఉన్నట్టు తేలినా.. పూర్తి బాధ్యత వహిస్తాను" అని అతడు ఇన్‌ స్టాగ్రాం లో పోస్ట్ చేశాడు.