Begin typing your search above and press return to search.

బైడెన్ వెరీ స్పెషల్...అందుకే మోడీ అలా...!

అయితే అమెరికా ప్రెసిడెంట్ వెరీ స్పెషల్. ఆయనకు అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్ డిన్నార్ ఇస్తున్నారు. అది కూడా ప్రధానమంత్రి అధికార నివాసంలో ఈ డిన్నార్ ని ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 5:19 PM GMT
బైడెన్ వెరీ స్పెషల్...అందుకే మోడీ అలా...!
X

అగ్ర రాజ్యం అధినేత, ప్రపంచానికి పెద్దన్న ఏ కాలంలో అయినా మొత్తం వరల్డ్ ని శాసించే సత్తా ఉన్న అధినాయకుడు. అందుకే ఆయన అంటే అన్ని దేశాలకు ఒక రకమైన స్పెషల్. భారత్ కూడా అదే తీరుని కనబరుస్తోంది. జీ 20 సమ్మిట్ పేరిట ఎందరో దేశాధినేతలు భారత్ కి వస్తున్నారు. వారందరికీ ఈ నెల 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిన్నర్ అధికారికంగా ఇస్తున్నారు.

అయితే అమెరికా ప్రెసిడెంట్ వెరీ స్పెషల్. ఆయనకు అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్ డిన్నార్ ఇస్తున్నారు. అది కూడా ప్రధానమంత్రి అధికార నివాసంలో ఈ డిన్నార్ ని ఏర్పాటు చేశారు. బైడెన్ కి మోడీ పట్ల అంతే స్పెషల్ ప్రేమ ఉంది. ఆ మధ్యన జరిగిన ఒక ఇంటర్నేషనల్ సదస్సుకు మోడీ హాజరైతే అందరిలో నుంచి వెతుక్కుని వెళ్ళి మరీ మోడీతో షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు బైడెన్.

అలా ఈ ఇద్దరు నేతల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇపుడు ప్రపంచం తీరు కూడా ఈ స్నేహానికి అద్దం పట్టేలా ఉంది. ఒక వైపు రష్యా చైనా ఉన్నాయి. మరో వైపు అమెరికా ఉంది. భారత్ తటస్థ విధానం అనుసరిస్తోంది. విదేశాంగ విధానంలో భారత్ తన వైఖరి ఇదే అని స్పష్టం చేస్తోంది. దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతుగా ఉన్నాయి.

ఒక వైపు రష్యా అమెరికాల మధ్య బిగ్ గ్యాప్ ఉంది. అయినా రష్యా భారత్ తో చెలిమికి చూస్తోంది. అలాగే అమెరికా కూడా అదే తన రూట్ అంటోంది. అసలు జో బైడెన్ భారత్ రాక వెనక జీ 20 సమ్మిట్ కంటే కూడా భారత్ తనకు అత్యంత మిత్ర దేశం అని ప్రపంచానికి చెప్పుకోవాలన్న తహతహ ఉంది అంటున్నారు.

దానికి తగినట్లుగానే ఆయన భారత్ కు ముందే చేరుకుని మోడీతో ప్రత్యేక భేటీ వేస్తున్నారు. జీ 20 సదస్సులో భాగంగా మోడీని కలిసే తొలి విదేశీ అతిధి కూడా జో బైడెన్ కావడం విశేషం. అంతే కాదు మోడీతో కలసి ఆయన నివాసంలో ప్రైవేట్ డిన్నార్ చేసే ఏకైక అతిధి ఆయనే. భారత్ మాకు బలమైన మిత్రుడు. క్లిష్టమైన పరిస్థితులలో భారత్ మద్దతు మాకే సుమా అని రష్యా సహా ఇతర దేశాలకు చాటి చెప్పాలన్నది అమెరికా వ్యూహం కావచ్చు.

ఏది ఏమైనా కోరి మరీ వచ్చి భారత్ తో ఆలింగనం చేస్తున్న పెద్దన్నను అంతే ప్రేమతో రిసీవ్ చేసుకోవడంలోనే ఉంది భారత విదేశాంగ రాజనీతి. జో బైడెన్ మద్దతుని భారత్ తీసుకుంటూనే రష్యాను సైతం దూరం చేసుకోని వైఖరిని అవలంబిస్తోంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇపుడు ప్రపంచం రెండుగా చీలినా కూడా భారత్ ని అందరూ కావాలనుకుంటున్నారు. మహా భారతంలో శ్రీ క్రిష్ణుడు పోషించిన పాత్రనే భారత్ ఇపుడు పోషిస్తోంది అని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అధ్యక్ష హోదాలో మొదటిసారి భారత్‌కు వచ్చిన బైడెన్ ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు.

అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రయివేటు డిన్నర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వరకు ఏ దేశ అధినేతకు ప్రధాని ప్రయివేటు డిన్నర్ ఇవ్వలేదు. ద్వైపాక్షిక చర్చలు, డిన్నర్ తర్వాత బైడెన్ హోటల్ మౌర్యకు వెళ్తారు. ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం.