Begin typing your search above and press return to search.

భువనేశ్వరి ములాఖత్ అందుకే ఆపాం... క్లారిటీ ఇచ్చిన జైళ్ల శాఖ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:33 AM GMT
భువనేశ్వరి ములాఖత్ అందుకే ఆపాం... క్లారిటీ ఇచ్చిన జైళ్ల శాఖ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో ఇటీవల ఆయన భార్య భువనేశ్వరి, లొకేష్, బ్రహ్మణి ములాకత్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ములాకత్ మేటర్ హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఒక సారి ఆయన కుటుంబ సభ్యులు ములాకత్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం తాజాగా పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు వెళ్లి కలిసి వచ్చారు. అనంతరం పవన్ కల్యాణ్... టీడీపీ - జనసేన పొత్తును ఫైనల్ చేశారు.

ఈ క్రమంలో మరోసారి ములాకత్ కు అనుమతి ఇవ్వాలని నారా భువనేశ్వరి జైలు అధికారులను కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో "నా భర్తను కలవనివ్వరా" అంటూ జైలు అధికారులను ప్రశ్నించారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్ ఖైదీ అనే విషయాన్ని స్పష్టం చేశారు.

అవును... భువనేశ్వరి మూలకత్ పై స్పందించిన జైళ్ల శాఖ అధికారులు.. ఆ విన్నపాన్ని తిరస్కరించడంపై వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా... చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు పెట్టుకున్నారని, అయితే దాన్ని తాము తిరస్కరించిన మాట వాస్తమమేనని తెలిపారు అధికారులు.

ఇదే క్రమంలో... రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు ములాఖత్‌ లు మాత్రమే ఉంటాయని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడవ ములాఖత్ మంజూరు చేస్తారని.. అయితే, భువనేశ్వరి అలాంటి అత్యవసర కారణాలను దరఖాస్తులో ఎక్కడా ప్రస్తావించలేదని.. అందుకే ఆ దరఖాస్తును తిరస్కరించామని జైలు అధికారులు స్పష్టం చేశారు.

అంటే... ములాఖత్ దరఖాస్తులో భువనేశ్వరి అత్యవసరణ కారణాన్ని ప్రస్తావించి ఉంటే అనుమతి లభించి ఉండేదన్న అంశాన్ని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారన్నమాట. దీంతో భువనేశ్వరి ములాఖత్ నిరాకరణపై టీడీపీ వర్గాలకు కూడా క్లారిటీ వచ్చినట్లయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భువనేశ్వరి తగిన కారణాలతో ములాఖత్ కోరే అవకాశముందని అంటున్నారు.