Begin typing your search above and press return to search.

కుప్పం కాదు... అక్కడ నుంచే భువనేశ్వరి....?

దాంతో చంద్రగిరి నుంచి భువనేశ్వరి తన రాజకీయ అరంగేట్రాన్ని మొదలెడుతున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 12:30 PM GMT
కుప్పం కాదు... అక్కడ నుంచే భువనేశ్వరి....?
X

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఎపుడు ఏ కార్యక్రమం చేపట్టినా కుప్పం నుంచే స్టార్ట్ చేస్తారు. అది ఆయన సొంత నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ఇలాకా. అలాంటిది ఫస్ట్ టైం కుప్పం నియోజకవర్గాన్ని ఆ సెంటిమెంట్ ని బాబు లేని టైం లో ఆ పార్టీ చేంజ్ చేసింది.

అంతే కాదు చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యే అయిన చంద్రగిరి నియోజకవర్గాన్ని టీడీపీ సెంటిమెంట్ గా పెట్టుకున్నట్లుగా ఉంది. చంద్రగిరి నిజానికి చంద్రబాబు సొంత ప్రాంతమే. అక్కడ ఉన్న నారావారి పల్లెలోనే బాబు పుట్టారు. అలా బాబు సొంతూరు సొంత ప్రాంతం నుంచే భువనేశ్వరి ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి పేరుతో టోటల్ స్టేట్ వైడ్ టూర్ స్టార్ట్ చేస్తున్నారు.

రాజకీయంగా చూడాలంటే ఇది కీలకం అని భావించాలి ఎవరైనా కూడా తమ పార్టీ గెలిచిన చోట బలం ఉన్న చోట నుంచే ఇలాంటి టూర్లు స్టార్ట్ చేస్తారు. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. అంతకు ముందు కాంగ్రెస్ అక్కడ నుంచి గెలిస్తే 2014 నుంచి వరసబెట్టి రెండు సార్లు వైసీపీ గెలుస్తూ వస్తోంది.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు ఇదే సీటు నుంచి పోటీ చేయబోతారు అని అంటున్నారు. చెవిరెడ్డి తప్పుకుంటే ఈ సీటు ఫేట్ మార్చాలని టీడీపీ చూస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇక కుప్పం తెలిచినా మరో చోట నిలిచినా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడంలేదు అన్న బెంగ అయితే చాలా కాలంగా ఉంది.

దాంతో చంద్రగిరి నుంచి భువనేశ్వరి తన రాజకీయ అరంగేట్రాన్ని మొదలెడుతున్నారు అని అంటున్నారు. అలా విపక్షం బలంగా ఉన్న సీటు నుంచి తన పర్యటనలు మొదలెట్టడం ద్వారా ఏమి సందేశం ఇస్తారు అన్నది ఇక్కడ చూడాల్సి ఉంది అంటున్నారు. వైసీపీ కంచుకోటలోనే జనం మాకు మద్దతుగా నిలిచారు అని చెప్పడానికే చంద్రగిరిని ఎంచుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అదే టైం లో వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా అన్న కొత్తరకం సందేహాలు కూడా పుట్టుకుని వస్తున్నాయి. ఏది ఏమైనా పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. వారి కుటుంబం అంతా అక్కడే పుట్టారు, అక్కడ నుంచే రాజకీయం చేస్తూ వస్తున్నారు. అదే చంద్రబాబు తీసుకుంటే కుప్పం వెళ్ళి గెలుస్తున్నారు.

మరి తమ సొంత ప్రాంతంలో కూడా పట్టు పెంచుకుని జెండా పాతాలన్న ఉద్దేశ్యంతోనే భువనేశ్వరిని అక్కడ నుంచి పర్యటనకు మొదలుపెట్టిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక వారూ వీరూ అని కాకుండా వచ్చే ఎన్నికల్లో భువనేశ్వరి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారా అన్న డౌట్లూ వస్తున్నారు. మొత్తానికి కుప్పం కాదు చంద్రగిరి అంటేనే టీడీపీ వ్యూహాలు దీని వెనక బోలెడు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.