Begin typing your search above and press return to search.

భూమన ఫ్యామిలీకి షాక్...అక్కడ ఆమె...?

ఏపీలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో తిరుపతి అసెంబ్లీ సీటు ఒకటి. ఈ సీటులో 2009లో మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి గెలిచారు.

By:  Tupaki Desk   |   8 Aug 2023 11:30 PM GMT
భూమన ఫ్యామిలీకి షాక్...అక్కడ ఆమె...?
X

ఏపీలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో తిరుపతి అసెంబ్లీ సీటు ఒకటి. ఈ సీటులో 2009లో మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఇక ప్రపంచ పుణ్య క్షేత్రం తిరుపతి ఉన్న సీటు ఇది. దాంతో ఈ సీటుకు ఎంతో పోటీ ఉంటుంది. తిరుపతి అసెంబ్లీ సీటు విషయానికి వస్తే కాంగ్రెస్ కి తెలుగుదేశానికి కూడా సరిసమానమైన బలం ఉంది. 1983లో ఎన్టీయార్ తొలిసారి తిరుపతిలో గెలిచి టీడీపీకి శుభారంభం పలికారు

అయితే దాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారంటే సామాజిక సమీకరణల అండతోనే. ఇక్కడ బలిజలు ఎక్కువ. వారికి పలు మార్లు టికెట్ ఇవ్వడం ద్వారా టీడీపీ ఈ సీటు దక్కించుకుంది. ఇక వైసీపీ అయితే ఇప్పటికి ఒక ఉప ఎన్నికతో కలుపుకుని మూడు సార్లూ రెడ్డి సామాజికవర్గానికే టికెట్ ఇచ్చింది. అలా భూమన కరుణాకరరెడ్డికే ఆ టికెట్ దక్కింది. అందులో ఒక సారి ఓడి రెండు సార్లు భూమన గెలిచారు.

ఇక ఆయన 2024 ఎన్నికలకు స్వస్తి పలకాలని చూస్తున్నారు. తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఈసారి సోషల్ ఇంజనీరింగ్ తోనే తిరుపతి ఎమ్మెల్యే సీటు పట్టాలని చూస్తున్నారు. అందుకే భూమనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చి ఆయన చిరకాల కోరిక తీర్చేశారు. ఇపుడు తిరుపతి సీటు మీద తీవ్ర కసరత్తు సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ ని పోటీకి పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. తిరుపతి అసెంబ్లీలో యాదవులు, బలిజలు అధికంగా ఉన్నారు. టీడీపీకి ఈ రెండు సామాజికవర్గాలలో పట్టు ఉంది. అయితే ఈసారి యాదవుల నుంచే టికెట్ ఇస్తే ఆ ఓట్లు చీలిపోయి టీడీపీ దెబ్బ తింటుందని, దాంతో పాటు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా కలసి వచ్చి విజయం సాధించడం సులువు అవుతుందని వైసీపీ హై కమాండ్ అంచనా వేస్తోంది.

ఇక భూమన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా న్యాయం చేస్తూ మేయర్ ఖాళీ చేసిన సీటుని ఆయనకు ఇవ్వాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అలా కనుక చేస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, తిరుపతి సీటు మరోసారి వైసీపీ పరం అవుతుందని లెక్కలేస్తున్నారుట.

నిజానికి 2019 ఎన్నికల్లో భూమన అతి స్వల్ప మెజారిటీ అంటే 700 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి సుగుణమ్మ మీద గెలిచారు. నాడు జనసేనకు పన్నెండున్నర వేల ఓట్ల మెజారిటీ దక్కింది. ఈసారి పొత్తులు ఈ రెండు పార్టీల మధ్య ఉంటే బీసీ ఓటుతోనే చెక్ చెప్పాలన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో భూమన ఫ్యామిలీకి తిరుపతి టికెట్ దక్కదు అన్నది తాజాగా జరుగుతున్న ప్రచారంగా ఉంది.