బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు.. సినీ సెలబ్రెటీలక మళ్లీ నోటీసులు?
ఈ వివాదంలో చిక్కుకున్నవారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల, ప్రణీత, రీతు చౌదరి వంటి ప్రముఖులున్నారు.
By: Tupaki Desk | 11 July 2025 8:04 PM ISTబెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో మరోసారి 29 మంది ప్రముఖులపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మళ్లీ నోటీసులు జారీ చేయాలని సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రమోషన్లకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు సమర్పించాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొననుంది.
-కేసులో చిక్కుకున్నవారిలో స్టార్ హీరోలు, యాక్టర్లు, యాక్ట్రెస్‌లు..
ఈ వివాదంలో చిక్కుకున్నవారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల, ప్రణీత, రీతు చౌదరి వంటి ప్రముఖులున్నారు. వీరితో పాటు పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. విచారణకు హాజరు కావాలని వీరికి ఈడీ త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.
- బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా కేసులు
మొత్తం 19 మంది బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఏ23, జంగిల్ రమ్మీ, యోలో 247, ఫెయిర్ ప్లే, తెలుగు 365, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, మామ 247, జై 365, ఆంధ్ర 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, ధని బుక్ 365 వంటి యాప్స్ యజమానులు ఉన్నారు. వీరి సంబంధాలు కూడా సెలబ్రిటీలతో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్
ఈడీ నోటీసులు అందుకోబోతున్న ఇన్ఫ్లుయెన్సర్లలో విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నయనీ పావని, అమృత చౌదరి, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత ఉన్నారు. వీరు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
-ఇక ఎవరైనా తప్పించుకోవడం కష్టమే!
ముందుగా విచారణ జరిగినప్పుడు చాలామంది సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కేసు మరింత తీవ్రమవుతుందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు హాజరుకాకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముంది.
మొత్తానికి... సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూను ఉపయోగించుకుంటూ, బెట్టింగ్ యాప్స్‌కు మద్దతిచ్చిన వారికి ఇప్పుడు చుక్కలు చూపించేలా ఉన్నాయి ఈడీ నోటీసులు అని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.
