Begin typing your search above and press return to search.

మస్క్ ను వెనక్కి నెట్టిన బెర్నార్డ్... టాప్ 10 కుబేరులు వీరే!

ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం ఒకెత్తు అయితే దాన్ని నిలబెట్టుకొవడం మరొకెత్తు అని అంటుంటారు

By:  Tupaki Desk   |   28 Jan 2024 4:59 AM GMT
మస్క్ ను వెనక్కి నెట్టిన బెర్నార్డ్... టాప్ 10 కుబేరులు వీరే!
X

ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం ఒకెత్తు అయితే దాన్ని నిలబెట్టుకొవడం మరొకెత్తు అని అంటుంటారు. పాకుడు రాళ్ల మీద ప్రయాణంలా ఉండే ఈ జాబితాలో ఈసారి ఫస్ట్ ప్లేస్ లో బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలవగా.. ఇంతకాలం ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. తాజాగా ఈ వివరాలను, వీటికి సంబంధించిన ఘణాంకాలను ఫోర్బ్స్ వెబ్ సైట్ ప్రచురించింది. ఇదే సమయంలో టాప్ 10 లిస్ట్ కూడా వెల్లడించింది.

అవును... నిన్నమొన్నటివరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టెస్లా, స్పేస్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అతడిని వెనక్కు నెట్టిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి ప్లేస్ లో నిలిచారు. లూయిస్ విట్టన్, సెఫోరాతో సహా 75 ఫ్యాషన్ - సౌందర్య సాధనాల బ్రాండ్‌ ల ఎల్.వీ.ఎం.హెచ్. సామ్రాజ్యాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన సంపద 207.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

2014లో 33.5 బిలియన్ డాలర్లుగా ఉన్న బెర్నార్డ్ సంపద.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు 207.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక రెండో స్థానానికి పడిపోయిన ఎలాన్ మస్క్ సంపాదన 204.7 బిలియన్ డాలర్లుగా ఉండగా... అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 181.3 బిలియన్ డాలర్ల సంపదతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా టాప్ 10 కుబేరుల జాబితాను ఇప్పుడు చూద్దాం...!

బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం (ఎల్.వి.ఎం.హెచ్) - $207.6 బిలియన్లు

ఎలోన్ మస్క్ (స్పెస్ ఎక్స్, టెస్లా) - $204.7 బిలియన్లు

జెఫ్ బెజోస్ (అమెజాన్) - $181.3 బిలియన్లు

లారీ ఎల్లిసన్ (ఒరాకిల్) - $142.2 బిలియన్లు

మార్క్ జుకర్బర్గ్ (ఫేస్ బుక్) - $139.1 బిలియన్లు

వారెన్ బఫెట్ (బెర్క్‌ షైర్ హాత్వే) - $127.2 బిలియన్లు

లారీ పేజీ (గూగుల్) - $127.1 బిలియన్లు

బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్) - $122.9 బిలియన్లు

సెర్గీ బ్రిన్ (గూగ్ల్) - $121.7 బిలియన్లు

స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్) - $118.8 బిలియన్లు