Begin typing your search above and press return to search.

'నా పెళ్లాం టార్చర్ భరించలేను.. జైలుకు వెళతా.. ఇంటికి వెళ్లను'

అతడ్ని బెంగళూరుకు రప్పించారు. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ మొదలైంది. తన భార్య తనను పెట్టే టార్చర్ తాను తట్టుకోలేకపోతున్నాని.. అందుకే ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 11:00 AM IST
నా పెళ్లాం టార్చర్ భరించలేను.. జైలుకు వెళతా.. ఇంటికి వెళ్లను
X

బెంగళూరుకు చెందిన ఒక టెకీ వ్యవహారం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఆయన తీరు హాట్ టాపిక్ గా మారింది. తన భార్య తనను టార్చర్ పెడుతోందని.. తాను ఇంటికి వెళ్లలేనని చెబుతున్నాడు. కావాలంటే.. జైలుకు పంపండి.. అందుకు సిద్ధమే.. కానీ ఇంటికి వెళ్లమని మాత్రం చెప్పొద్దన్న అతగాడి వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగళూరులోని మాన్వతా టెక్ పార్కులోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేసే ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

34 ఏళ్ల ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త. బెంగళూరు నివాసి అయిన అతనిది స్వస్థలం యూపీలోని లక్నో. ఈ మధ్యన కనిపించకుండాపోయాడు. నెల నుంచి అతడు కనిపించట్లేదన్న విషయాన్ని ఆయన భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ అతగాడి ఆచూకీ దొరక్కపోవటంతో.. ఈ మధ్యన ఆమె తన భర్త కనిపించట్లేదని.. పోలీసులకు కంప్లైంట్ చేసినా స్పందించటం లేదని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు. దీంతో.. పరుగులు పెట్టిన పోలీసులు చివరకు అతడ్ని ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలో ఉన్నట్లు గుర్తించారు.

అతడ్ని బెంగళూరుకు రప్పించారు. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ మొదలైంది. తన భార్య తనను పెట్టే టార్చర్ తాను తట్టుకోలేకపోతున్నాని.. అందుకే ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు చెప్పారు. 42 ఏళ్ల తన భార్య పెట్టే టార్చర్ తాను భరించలేకపోతున్నానని.. తమకు ఇద్దరు పిల్లలుగా చెప్పాడు.

వీరి కుటుంబం బెంగళూరులోని కొడిగేహళ్లిలోని టాటా నగర్ లో ఉంటున్నారు. ఇటీవల బైక్ మీద ఇంటి నుంచి బయలుదేరిన అతను.. బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.1.80లక్షలు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. దీంతో.. అతని భార్య పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంటికి వెళ్లేది లేదని చెబుతున్న ఇతగాడి వ్యవహారంలో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవటం లేదని చెబుతున్నారు.