Viral Video: రోడ్డు మీద హీరోలా ఫోజు.. పోలీసులు స్టేషన్లో తీర్చారు వీడి మోజు
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.
By: Tupaki Desk | 18 April 2025 11:39 AM ISTఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. అంతే కాకుండా సోషల్ మీడియా ప్రభావం కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్, వ్యూస్‌ల కోసం కొంతమంది యువత చేసే విన్యాసాలు శృతి మించిపోతున్నాయి. వాటి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు వెనుకాడడం లేదు. అవి వారిని కొన్ని సార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇన్స్‌స్టాగ్రామ్‌లో తమ రీల్స్‌ను ప్రపంచానికి కొత్తగా చూపించాలనే పిచ్చి తలకెక్కి ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నాయి. తాజాగా ఒక మహా ఘనుడు బెంగళూరు నడిరోడ్డునే తన స్టూడియోగా మార్చేశాడు. నడి రోడ్డు మీద దర్జాగా కుర్చీ వేసుకొని కూర్చుని, టీ సిప్ చేస్తూ.. ఏదో పెద్ద స్టార్ హీరోలా ఫోజులు కొడుతూ రీల్ తీశాడు. ఆ వీడియో పుణ్యమా అని తర్వాత పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
సిలికాన్ సిటీ బెంగళూరులోని మగడి రోడ్డు ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిపోతోంది. ఎందుకంటే అక్కడ ఒక యువకుడు చేసిన 'నడిరోడ్డు టీ పార్టీ' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ నెల 12న జరిగిన ఈ విచిత్రమైన ఘటనలో ఓ కుర్రాడు ఏకంగా నడిరోడ్డు మీద ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక చేత్తో టీ కప్పు పట్టుకుని, మరో చేత్తో ఫోన్ పట్టుకుని ఏదో సినిమాలో హీరోలా బిల్డప్ ఇస్తూ రీల్ తీశాడు. బహుశా ఆ రీల్‌కు మిలియన్ల వ్యూస్ వస్తుండొచ్చని పాపం కలలు కన్నాడు. కానీ అప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది.
