Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌కు షాక్.. రూ.2 కోట్ల బాకీతో మూసివేత!

బెంగళూరులో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ వన్8 కమ్యూన్ మూతపడటం ప్రస్తుతం అందరిదీ ఆశ్చర్యపరచడం. ఒకప్పుడు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో సంబంధం ఉండటం వల్ల.. ఈ రెస్టారెంట్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 April 2026 12:00 AM IST
విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌కు షాక్.. రూ.2 కోట్ల బాకీతో మూసివేత!
X

బెంగళూరులో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ వన్8 కమ్యూన్ మూతపడటం ప్రస్తుతం అందరిదీ ఆశ్చర్యపరచడం. ఒకప్పుడు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో సంబంధం ఉండటం వల్ల.. ఈ రెస్టారెంట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు అద్దె.. చట్టపరమైన సమస్యల కారణంగా ఈ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేయబడింది.

ఈ రెస్టారెంట్ 2023 చివర్లో ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ కి అప్పట్లో మంచి పేరు ఉండేది. ముఖ్యంగా ఎం. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉండటం వల్ల క్రికెట్ అభిమానులు, ఫుడ్ ప్రియులు ఎక్కువగా వచ్చేవారు. కానీ కొద్దికాలానికే సమస్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు ఆరు నెలల పాటు అద్దె చెల్లించలేదు. మొత్తం బాకీలు రూ.2 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది. ఇందులో మెయింటెనెన్స్ ఛార్జీలు, రెవెన్యూ షేర్ కూడా ఉన్నాయి.

ఈ పరిస్థితి వల్ల భవనం యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు అన్ని బాకీలు క్లియర్ చేసే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ బ్రాంచ్ పూర్తిగా పనిచేయడం లేదు.

ఇప్పటికే విరాట్ కోహ్లీ ఈ రెస్టారెంట్‌తో సంబంధాలు తెంచుకున్నాడు. కొన్ని నిబంధనలు పాటించకపోవడం, భద్రతా సమస్యలు రావడం వల్ల ఆయన ఈ రెస్టారెంట్ నుంచి తొలగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అగ్ని ప్రమాద భద్రత నిబంధనలు పాటించలేదని నోటీసులు కూడా వచ్చాయి. అలాగే ధూమపానం కోసం ప్రత్యేక స్థలం (స్మోకింగ్ జోన్) ఏర్పాటు చేయకపోవడం పై కూడా కేసు నమోదైంది.

స్థానిక అధికారులు కూడా పలుమార్లు హెచ్చరికలు ఇచ్చారు. అవసరమైన అనుమతులు లేకుండా రెస్టారెంట్ నడుస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇంకా అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు రెస్టారెంట్‌ను తెరిచి ఉంచినందుకు కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ అన్ని సమస్యల కారణంగా రెస్టారెంట్ పేరు దెబ్బతింది. కోహ్లీ బయటకు వెళ్లిన తర్వాత కస్టమర్లు కూడా తగ్గిపోయారు. దీంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది.

ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో మళ్లీ తెరుస్తారా లేదా అనేది యాజమాన్యం బాకీలు చెల్లించి, అన్ని చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుంది.