Begin typing your search above and press return to search.

మెట్రోలో జంట వెర్రి చేష్టలు.. సిగ్గు లేదా అంటూ తిడుతున్న నెటిజన్స్

ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రజారవాణా వ్యవస్థలో భద్రత, మహిళల గౌరవం పట్ల ఆందోళనలను పెంచాయి.

By:  Tupaki Desk   |   11 April 2025 3:35 PM IST
మెట్రోలో జంట వెర్రి చేష్టలు.. సిగ్గు లేదా అంటూ తిడుతున్న నెటిజన్స్
X

ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రజారవాణా వ్యవస్థలో భద్రత, మహిళల గౌరవం పట్ల ఆందోళనలను పెంచాయి. ఈ ఘటనతో మెట్రో ప్రయాణాల్లో మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు బెంగళూరు మెట్రోలో కూడా ఇలాంటి సంఘటనే జరగడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. బెంగళూరు మెట్రో స్టేషన్‌లో ఒక జంట బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమిషం 25 సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్‌ను @karnatakaportf ఖాతా ఉన్న ఒక వినియోగదారు సోషల్ సైట్ Xలో షేర్ చేశారు.

ఆ జంటలోని యువకుడు యువతి టీషర్టులో తన చేతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనతో బెంగళూరు మెట్రో స్టేషన్ కూడా ఢిల్లీ మెట్రోలా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట ప్రవర్తన అక్కడి ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అసభ్యకర ప్రవర్తనను ఖండించారు. మెట్రో స్టేషన్లలో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బెంగళూరు మెట్రోలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనను సహించకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెట్రో స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. యువత ఇలాంటి అసభ్యకర ప్రవర్తనకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.