ఆంటీతో జాగ్రత్త.. బెంగళూరు జిమ్ ట్రెయినర్ విషాదం
బెంగళూరు నగరానికి చెందిన దిలీప్ జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. 27 ఏళ్ల దిలీప్ గత శనివారం తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By: Tupaki Political Desk | 14 April 2026 11:48 AM ISTకొన్ని పరిచయాలు ప్రాణాల మీదకు తెస్తాయనేందుకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. 42 ఏళ్ల ఆంటీతో స్నేహం కాస్త పీకకు ఉరి వేలాడేలా చేస్తుందని ఆ యువకుడు ఊహించి ఉండడు. జిమ్ ట్రైనర్ గా శారీరకంగా ఫిట్ గా ఉన్నా, మానసికంగా కుంగుబాటుకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు. ఈ సంఘటన ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న అనైతిక సంబంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తున్నాయో తెలియజేస్తున్నాయని అంటున్నారు.
బెంగళూరు నగరంలోని 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ బలవన్మరణంపై నమోదైన కేసు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆ యవకుడి మృతికి ఓ అంటీ కారణమని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు షాకింగ్ కు గురిచేస్తోంది. వివాహిత వేధింపులు తాళలేక జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కంటెంట్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ సర్కిల్స్ లో ఓ ట్రెండింగ్ సబ్జెక్టుగా వైరల్ అవుతోందని అంటున్నారు.
బెంగళూరు నగరానికి చెందిన దిలీప్ జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. 27 ఏళ్ల దిలీప్ గత శనివారం తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ముందుగా 42 ఏళ్ల మహిళలకు తెలియజేశాడు. అనంతరం తన ప్లాట్ లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దిలీప్ ఫోన్ చేసి చెప్పిన సమాచారాన్ని ఆ మహిళ వెంటనే అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు దిలీప్ ప్లాట్ కు చేరుకునేలోపే ప్రాణాలు తీసుకున్నాడు.
అయితే దిలీప్ ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి ఆ 42 ఏళ్ల యువతే కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్ నిర్వహిస్తున్న జిమ్ లో ఫిట్ నెస్ శిక్షణకు వచ్చిన సదరు మహిళ అతడితో స్నేహంగా మెలిగుతూ వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆ తర్వాత డబ్బు, ఆస్తుల కోసం వేధించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గతంలో పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిందని, ఆ తర్వాత కూడా వివాహిత వేధింపులు ఆగలేదని అంటున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దిలీప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆత్మహత్యకు ముందు మృతుడు దిలీప్ తన సోషల్ మీడియాలో వివాహితను అన్ ఫ్రెండ్ చేశాడని, వీడియో కాల్ చేసి చనిపోతున్నట్లు తెలిపాడని అంటున్నారు. దీనిపై నేలమంగళ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
