Begin typing your search above and press return to search.

ఆమెకు 36.. అతడికి 25.. జాతరలో పరిచయం కట్ చేస్తే మర్డర్

ఇప్పుడున్న సంతోషానికి మించింది ఏదో కావాలి. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా మారుతున్నారు కొందరు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 4:46 PM IST
ఆమెకు 36.. అతడికి 25.. జాతరలో పరిచయం కట్ చేస్తే మర్డర్
X

ఇప్పుడున్న సంతోషానికి మించింది ఏదో కావాలి. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా మారుతున్నారు కొందరు. అతి ఆశ ఎప్పుడూ విషాదానికే దారి తీస్తుంది. అందునా.. వివాహేతర సంబంధాలేవీ ప్రశాంత జీవనానికి అడ్డంకిగా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు బోలెడన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.ఇటీవల కాలంలో షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆ రాష్ట్రం నిలుస్తోంది.

తాజా విషాద ఉదంతంలోకి వెళితే.. బెంగళూరులోని 36 ఏళ్ల హరిణికి.. దాసే గౌడకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారిద్దరూ కెంగేరిలో నివాసం ఉంటారు. కొన్ని నెలల క్రితం అక్కడ జరిగిన జాతర.. దానికి వెళ్లిన హరిణి జీవితంలో పెను మార్పుల్ని తీసుకొచ్చింది. ఆ జాతరలో ఆమెకు పాతికేళ్ల యశస్ పరిచయమయ్యాడు. ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారి.. ఆపై వివాహేతర సంబంధం వరకు వెళ్లింది.

ఈ విషయాన్ని గుర్తించిన భర్త దాసే గౌడ్ ఆమెను హెచ్చరించాడు. భార్య దగ్గరి ఫోన్ తీసుకొని.. యశస్ తో కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో.. తాను తప్పు చేశానని.. ఇకపై అలాంటి పొరపాట్లు చేయనంటూ క్షమాపణలు చెప్పింది. దీంతో.. భార్యను నమ్మి ఆమె ఫోన్ ను ఇచ్చాడు. అయితే.. ఆమె మాత్రం మాట తప్పి.. ప్రియుడికి మళ్లీ కాంటాక్టులోకి వెళ్లింది.

ఆమెతో మాట్లాడాలని చెప్పిన యశస్.. బెంగళూరుకు రావాలని చెప్పటంతో ఆమె వెళ్లింది. అతడు బస చేసిన హోటల్ కు వెళ్లిన ఆమె.. హరిణిని తనతో ఉండాలని పట్టుబట్టాడు. ఆమె లేకుండా తాను జీవించలేనన్నాడు. అందుకు ఆమె నో చెప్పటంతో ఆవేశానికి గురైన అతను.. ఆమెను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీంతో అతడు హోటల్ రూం నుంచి పరారయ్యాడు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. యశస్ ను అదుపులోకి తీసుకున్నారు. కొత్త పరిచయాలు తప్పు కాదు. కానీ.. వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాల్ని నాశనం చేయటమే కాదు.. ప్రాణాల్ని తీసే వరకు వెళుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.