నువ్వు 'సింగం' అయితే.. నేను 'పుష్ప': ఐపీఎస్‌కు నేత వార్నింగ్
142 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులుగా.. యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన 95 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది.
By: Garuda Media | 29 April 2026 12:49 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ బుధవారం జరగనుంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఈ తుది దశలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఐపీఎస్ అదికారులను తీసుకువచ్చి.. ఎన్నిక ల `పరిశీలకులు`గా ఇక్కడ నియమించింది. వీరిలో ఓ యువ ఐపీఎస్ అధికారి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు.. వారి అనుకూల ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో తృణమూల్ కార్యకర్తలను కట్టడి చేయడంతో పాటు.. ఆ పార్టీ అనుకూల ప్రాంతాల్లోనూ.. ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``నువ్వు సింగం అయితే.. నేను పుష్ప`` అని వ్యాఖ్యానించారు. తమ వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు. నిబంధనలు కేవలం టీఎంసీ వారికేనా? అని నిలదీశారు. దీంతో ఇప్పుడు మరింత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఏం జరిగింది?
142 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులుగా.. యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన 95 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ ఒకరు. ఈయనకు దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఈయనకు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగానే కాకుండా.. `సింగం` అనే పేరు కూడా ఉందని ప్రచారంలో ఉంది. కాగా.. స్థానికంగా ఉన్న నాయకులను ఉద్దేశించి.. ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఐపీఎస్ శర్మ హెచ్చరికలు జారీ చేయడంతోపాటు.. నియోజకవర్గాల లో నేతల ఇళ్లను కూడా ఆయన తనిఖీలు చేస్తున్నారు. ఈ పరిణామాలు టీఎంసీలో కలకలం రేపాయి. దీనిపై అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న జహంగీర్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. `నువ్వు ‘సింగం’ అయితే.. నేను పుష్ప`` అని వ్యాఖ్యానించా రు. ఎన్నికల్లో అధికారులు తమ వారిని బెదిరింపులకు గురిచేస్తే.. తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తిరిగి వెళ్లేప్పుడు అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల పరిశీలకులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కోడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. ఖాన్‌పై కేసులు పెట్టింది.
