Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌లోకి ట్రంప్‌.. చిన్న కుమారుడు

రాజ‌కీయ వార‌స‌త్వంలో ముందున్న అమెరికాలో ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు

By:  Tupaki Desk   |   9 May 2024 1:30 PM GMT
పాలిటిక్స్‌లోకి ట్రంప్‌.. చిన్న కుమారుడు
X

రాజ‌కీయ వార‌స‌త్వంలో ముందున్న అమెరికాలో ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు. ఆయ‌నే మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు. ఇప్ప‌టికే ట్రంప్ కుమారులు, కుమా ర్తె రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జూనియ‌ర్ ట్రంప్‌, ఎరిక్‌, టిఫ‌నీలు.. యాక్టివ్ పాలిటి క్స్ లో పాల్గొంటున్నారు. వీరు రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ఫ్లోరిడాలో ప్ర‌తినిధులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు ట్రంప్ చిన్న కుమారుడు బ్యార‌న్‌(18) కూడా అత్యంత పిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఈ విష‌యాన్ని రిప‌బ్లిక‌న్ పార్టీ చైర్మ‌న్ ఇవ‌న్ ప‌వ‌ర్ వెల్ల‌డించారు. అంతేకాదు.. బ్యార‌న్‌ను కూడా.. ఫ్లోరిడా ప్ర‌తినిధిగానే నియ‌మించ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే.. దీనికి సంబంధించి రాజ‌కీయంగా లాంఛ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

జూలైలో రిప‌బ్లిక‌న్ పార్టీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తారు.(మ‌న ద‌గ్గ‌ర ప్లీన‌రీ అంటారు) ఈ స‌ద‌స్సులో బ్యాన‌ర్‌ను అధికారికంగా పార్టీలో చేర్చుకుని ఆయ‌న‌కు ఫ్లోరిడా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. ఇక‌, త‌న‌చిన్న కుమారుడు రాజ‌కీయ అరంగేట్రం చేసేందుకు ట్రంప్ కూడా ఓకే చెప్పారు. దీంతో ఆయ‌న‌కు అడ్డంకులు లేకుండా పోయాయి.

ఎవ‌రీ బ్యార‌న్‌..

డొనాల్డ్ ట్రంప్ రెండో భార్య కుమారుడు బ్యార‌న్‌. ఈయ‌న ఇప్ప‌టివ‌ర‌కు విద్య‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌టి ప్ర‌పంచానికి కూడా పెద్ద‌గా పరిచ‌యం లేదు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఏ అధికారిక కార్య‌క్ర‌మంలోనూ బ్యార‌న్ పాల్గొన‌లేదు. వ‌చ్చే వారం ఈయ‌న గ్యాడ్యుయేట్ ప‌ట్టా అందుకోనున్నారు. చ‌దువు అయ్యీ అవ‌డంతోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇక్క‌డ చెప్పుకోవ‌ల్సిన విష‌యం ఏంటంటే.. న‌వంబ‌రులో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కుటుంబాన్ని మొత్తంగా రాజకీయంగా వాడుకునేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నిస్తుండ‌డం.