Begin typing your search above and press return to search.

ఆర్జీవీపై కేసుపెట్టిన బర్రెలక్క... తెరపైకి మహిళా కమిషన్!

ఆ ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నారైలు, మాజీ ఐపీఎస్ లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:08 PM GMT
ఆర్జీవీపై కేసుపెట్టిన బర్రెలక్క... తెరపైకి మహిళా కమిషన్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బర్రెలక్కకు అటు సోషల్ మీడియాతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో కూడా భారీగానే మద్దతు పెరిగింది. కేవలం నిరుద్యోగుల నుంచే కాదు.. అన్ని వర్గాలవారి నుంచి ఆమెకు ఆదరణ వచ్చింది! అయితే... ఆ ఎన్నికల ఫలితాల అనంతరం బర్రెలక్కకు 5,754 ఓట్లు పోలయినట్లు ఈసీ వెల్లడించింది!

ఆ ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నారైలు, మాజీ ఐపీఎస్ లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెడితే ఆమెకు ఐదువేలకంటే ఎక్కువగా ఓట్లు పోలవ్వడం శుభసూచనకమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆ సంగతి అలా ఉంటే... ఎన్నికల ఫలితాల అనంతరం పెద్దగా వినిపించని బర్రెలక్క పేరు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది! ఆమె తాజాగా ఆర్జీవీపై కేసు పెట్టారు!

అవును... దర్శకుడు రాం గోపాల్ వర్మపై తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క కేసు పెట్టారు. ఇందులో భాగంగా... ఆమె తరపున లాయర్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం స్పందించిన ఆయన..."ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, ఆమె బర్రెలను కాస్త ఉంటుంది, బర్రెలు ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు" అని పేర్కొన్నట్టు సదరు లాయర్ తెలిపారు.

అనంతరం... "నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలింస్ తీసుకుని బతుకు.. కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు" అని అన్నారు. అక్కడితో ఆగని ఆయన... "నువ్వూ ఏడపుట్టినావో, ఎవడికి పుట్టినావో, ఎట్ల పుట్టినావో, నీకు ఎంతమంది పుట్టారో లెక్కా లేదు పత్తా లేదు" అని ఆర్జీవీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా... నవంబర్ 26న బర్రెలక్కపై ట్వీట్ చేసిన వర్మ.. ఆమెను మహాత్మ గాంధీతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బర్రెలక్క.. నేటి మహాత్మాగాంధీ అని అభివర్ణించారు ఆర్జీవీ. ఆనాడు జాతిపిత మహాత్మ గాంధీ కూడా బర్రెలక్క మాదిరిగానే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉద్యమానికి తెర లేపారని గుర్తు చేశారు. మహాత్మ గాంధీతో పోల్చూతూ.. ఆమె ధైర్యాన్ని ఆర్జీవీ అభినందించారు.