Begin typing your search above and press return to search.

బాప‌ట్ల‌లో ర‌ఘుప‌తి ఎక్క‌డ‌బ్బా ..!

బాపట్ల నియోజకవర్గంలో వైసీపీకి ఎక్కడా అవకాశాలు కనిపించడం లేదు. గతంలో రెండు సార్లు వరుసగా విజయం దక్కించుకున్న పరిస్థితుల‌ నుంచి ఇప్పుడు వైసీపీని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ కనిపించడం లేదు.

By:  Garuda Media   |   14 Dec 2025 9:00 PM IST
బాప‌ట్ల‌లో ర‌ఘుప‌తి ఎక్క‌డ‌బ్బా ..!
X

బాపట్ల నియోజకవర్గంలో వైసీపీకి ఎక్కడా అవకాశాలు కనిపించడం లేదు. గతంలో రెండు సార్లు వరుసగా విజయం దక్కించుకున్న పరిస్థితుల‌ నుంచి ఇప్పుడు వైసీపీని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ కనిపించడం లేదు. ప్రధానంగా బాపట్ల నియోజకవర్గానికి రాజధాని ప్రాంతానికి మధ్య సంబంధం బలపడింది. రాజధాని ప్రాంతంపై ఇక్కడి వాసులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా ఇది అమ‌రావ‌తికి చేరువుగా ఉన్న నేపథ్యంలో రాజధాని వివాదం జరిగినప్పుడు రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు బాపట్ల ప్రజలు అండగా ఉన్నారు.

వారి ఉద్యమానికి సహకరించారు. ఇక్కడ మెజారిటీ రైతులు కూడా రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రభావం వైసీపీని ఇంకా వెంటాడుతూ ఉంది. వాస్తవానికి ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉందా లేదా అనేది పక్కన పెడితే సంస్థాగతంగా వైసిపి పై పడినటువంటి మరకలుగానే మచ్చలు గాని ఆ పార్టీని తీవ్ర ప్రభావానికి గురిచేస్తున్నాయి. ఇది అభ్యర్థులపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కోన రఘుపతి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయనపై వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకత లేకపోయినప్పటికీ పార్టీ పరంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది.

ఇదే ఎన్నికల్లో కూడా కనిపించింది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు విజయం సాధించారు. అదే సమయంలో కోన రఘుపతి కూడా తనపై ఎలాంటి ప్రభావం చూపించదని అనుకున్నారు. అంత భారీ పోరులో కూడా ఆయన 62,000 పైచిలుకు ఓట్లను సాధించి బలమైన పోటీ ఇచ్చారు. కానీ, రాజధాని ప్రభావం అదేవిధంగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వంటివి కోన రఘుపతి పై ప్రభావం చూపించాయి.

అయితే, ఇప్పటికీ పరిస్థితులలో మార్పు లేకపోవడంతో రఘుపతి వ్యవహారం మరోసారి రసకందాయంలో పడింది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన టికెట్ దక్కించుకున్నా ప్రయోజనం అయితే కనిపించడం లేదు. మరోవైపు ప్రజల్లో ఉండే విషయంలో కూడా రఘుపతి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. ఒకవేళ వచ్చినా కొత్తగా జనాలను పట్టించుకోవడం కూడా లేదు. ఆయన్ని జనాలు కూడా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

సో మొత్తంగా చూస్తే బాపట్ల వంటి కీలక నియోజకవర్గం లో బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ వైసీపీ చేసుకున్న కొన్ని సంస్థాగ‌త‌ తప్పుల కారణంగా ఆ పార్టీ వెనుకబడింది అన్నది వాస్తవం. మరి వచ్చే ఎన్నికలనాటికైనా పార్టీ మార్పులు చేసుకుని ప్రజల్లోకి వస్తుందా లేకపోతే ఇలానే కొనసాగుతుందా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ ఇప్పటికి ఉన్న‌ టాక్ ప్రకారం బాపట్లలో మరోసారి వైసీపీకి అయితే అవకాశాలు చాలా చాలా సంక్లిష్టంగా మారుతున్నాయని చెబుతున్నారు.