వారానికి ఏడు రోజులు.. ఆరుగురితో డేటింగ్.. ఎవరీమె..!
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లో ఓ యువతి ఒకేసారి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది!
By: Tupaki Desk | 9 July 2025 11:50 AM ISTఇటీవల కాలంలో దంపతుల జీవితాల్లో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నానే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న క్రైమ్ అంత ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఎన్నో ఘోరమైన నేరాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ఒకేసారి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేస్తున్న ఓ యువతి వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది!
అవును... ఉన్నది ఒకటే జీవితం, జీవితానికి ఒకరే భాగస్వామి, ఒకసారి వివాహం అయినతర్వాత జీవితాంతం వారితోనే జీవితం, ఒకసారి మనసు పడిన తర్వాత వారితోనే వివాహం, వారితోనే ప్రయాణం అనే మాటలు ఇప్పుడు చెబితే నవ్వుకునే వారు కొందరైతే, ఏ రోజుల్లో ఉన్నారు మీరు అని ఎదురు ప్రశ్నించేవారు ఇంకొదరు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! అలా అని అంతా అలా ఉన్నారని కాదు!!
మంచివారు ఏ కాలంలోనైనా ఉంటారు.. పద్దతిగా ఉండేవారు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే జరుగుతున్న ఘటనలు, వెలుగులోకి వస్తోన్న విషయాలు ఈ చర్చకు ఇటీవల కాలంలో మరింత బలాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లో ఓ యువతి ఒకేసారి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది!
ఈ క్రమంలో ఆ అరుగురిలో ఒకరు ఈ విషయన్ని గ్రహించారని.. అది కన్ఫాం అని తెలియగానే ఈ విషయం మిగిలినవారికీ చెప్పాలని భావించినట్లున్నాడు.. అది కూడా ఆమె సమక్షంలో రెడ్ హ్యాండెడ్ గా అన్నట్లు! ఈ క్రమంలో... ఆ బాయ్ ఫ్రెండ్స్ లో ఒకరు మిగిలిన ఐదుగురితో పాటు ఆమెను ఢాకాలోని ఒక రెస్టారెంట్ కు ఆహ్వానించి, నిజం బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సమయంలో వారు ఆమెను ముఖాముఖిగా ఎదుర్కొన్నారు. అంతా ఒకేసారి రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సదరు యువతి ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు కనిపిస్తుంది! ఈ సమయంలో ఆమెకు నోట మాట రాలేదు! దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది! ఇక కామెంట్ సెక్షన్ లో నెటిజన్ల క్రియేటివిటీ పీక్స్ కి చేరుతుంది!
ఇందులో భాగంగా... "ఇప్పుడు ఆ ఆరుగురు ఆమెకు సోదరులు అవుతారు" అని ఒకరు రాస్తే.. "సోమవారం నుంచి శనివారం వరకూ 'ఆరు' రోజులు.. ఆదివారం హాలిడే" అని మరొకరు స్పందించారు. "అమ్మాయిలు అబ్బాయిల నుంచి నేర్చుకుంటున్నారు" అని మరొకరు రియాక్ట్ అయితే... "ఒకేసారి 10 మంది అమ్మాయిలతో డేటింగ్ చేసే అబ్బాయిలను కూడా చూపించండి" అని ఇంకొకరు కామెంట్ చేశారు.
