Begin typing your search above and press return to search.

షేక్ హసీనా లేని తొలి ఎన్నికలు...భారత్ కి చిక్కులేనా ?

బంగ్లాదేశ్ భారత్ సైన్యం పోరాట పటిమ సాక్ష్యంగా ఏర్పడిన దేశం. తూర్పు పాకిస్తాన్ గా ఉంటూ పాకిస్తాన్ పాలక నిర్లక్ష్యానికి మూడు దశాబ్దాలుగా మగ్గిన తరువాత భారత్ చొరవతో మోక్షం పొంది ప్రత్యేక దేశంగా అవతరించింది.

By:  Satya P   |   13 Feb 2026 7:00 AM IST
షేక్ హసీనా లేని తొలి ఎన్నికలు...భారత్ కి చిక్కులేనా ?
X

బంగ్లాదేశ్ భారత్ సైన్యం పోరాట పటిమ సాక్ష్యంగా ఏర్పడిన దేశం. తూర్పు పాకిస్తాన్ గా ఉంటూ పాకిస్తాన్ పాలక నిర్లక్ష్యానికి మూడు దశాబ్దాలుగా మగ్గిన తరువాత భారత్ చొరవతో మోక్షం పొంది ప్రత్యేక దేశంగా అవతరించింది. అయితే దేశం ఏర్పాటు అయ్యాక బంగ్లా జాతి పిత ముజఫర్ రెహమాన్ కొన్నాళ్ళు పాలించారు. కానీ అనంతరం ఆయన హత్య కావించబడ్డారు. ఆ తరువాత ఆయన పార్టీ అవామీ లీగ్ నాయకత్వం కుమార్తె షేక్ హసీనా దక్కించుకున్నారు. అవామీ లీగ్ భారత్ తో మంచి సంబంధాలు నెరుపుతూ పొరుగు దేశంగా ఉంది. కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆ పార్టీకి ప్రత్యామ్యాయంగా బంగ్లాదేశ్ లో ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని చెబుతారు.

సుదీర్ఘ కాలంగా :

ఇదిలా ఉండగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఏకంగా 20 సంవత్సరాలకు పైగా పనిచేశారు, 1996 నుండి 2001 వరకు అలాగే, 2009 నుండి ఆగస్టు 5, 2024న రాజీనామా చేసే వరకు ప్రధానిగా ఆమె ఉన్నారు. అవామీ లీగ్ నాయకురాలిగా, ఆమె ఆ దేశ ప్రధాన ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అదే సమయంలో నిరంకుశత్వ వైఖరిని అవలంబిస్తారు అన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇక 2024లో అక్కడి విద్యార్థుల నేతృత్వంలోని సామూహిక నిరసనల తరువాత ఆమె భారతదేశానికి శరణార్ధిగా వచ్చారు.

బంగ్లా రాజకీయాల్లో :

మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 1978లో జియావుర్ రెహమాన్ చేత స్థాపించబడిన పార్టీగా ఉంది. జాతీయ వాదాన్ని విశ్వసించే ఈ పార్టీ అవామీ లీగ్‌కు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఈ పార్టీకి ఖలీదా జియా దీర్ఘకాలంగా నాయకత్వం వహించారు. ఆమె మరణం తరువాత ఈ పార్టీకి ప్రస్తుతం తారిక్ రెహమాన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అవామీ లీగ్ పోటీలో ఉంటే కనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచే అవకాశాలు బహు తక్కువ. కానీ ఈసారి పోటీలోనే ఆ పార్టీ లేకుండా చేశారు. షేక్ హసీనా మీద తాత్కాలిక ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది, మరణ శిక్షకు దారి తీసే కేసులు అవి. దాంతో ఆమె భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

బీఎన్ఎస్ తో ఇబ్బందే :

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ ఎన్నికలు గురువారం జరిగాయి. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముందంజలో ఉంది. అంటే తాత్కాలిక ప్రభుత్వానికే అధికారం దక్కుతోంది అని భావించాల్సి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్‌పర్సన్ తారిక్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో విజయం సాధించారు అని చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో గెలుస్తున్నారు అని అంటున్నారు. బీఎన్ఎస్ కనుక అధికారంలోకి వస్తే భారత్ కి కొంత ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు.

వేచి చూసే వైఖరితో :

ఇక బంగ్లాదేశ్ లో ఎన్నికలు ఫలితాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అన్నీ కూడా భారత్ నిశితంగా గమనించనుంది. వేచి చూసే వైఖరిలో భారత్ ఉంది. అక్కడ ఫలితాలు ఎవరు ప్రభుత్వం చేస్తారు అన్నది చూసిన తర్వాతనే స్పందిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ ఎన్నికలు పూర్తిగా స్వేచ్చగా పారదర్శకంగా జరగాలన్నది భారత్ అభిమతం అని ఆయన చెప్పారు. అయితే బంగ్లాలో ఎన్నికలు జరిగిన తీరు మీద అక్కడ ఇతర పార్టీలే ఆరోపిస్తున్నాయి. నిష్పాక్షికతపై సందేహాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.